Samantha : హిట్ వర్స్‌లో సమంత.. వైరల్ అవుతున్న అడివి శేషు ట్వీట్!

అడివి శేషు హీరోగా, నేచురల్ స్టార్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'హిట్-2'. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలు మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి షో నుంచే హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా..

Samantha : హిట్ వర్స్‌లో సమంత.. వైరల్ అవుతున్న అడివి శేషు ట్వీట్!

Samantha in Hit universe

Samantha : అడివి శేషు హీరోగా, నేచురల్ స్టార్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్-2’. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలు మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి షో నుంచే హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా.. హిట్ వర్స్ లో సెకండ్ పార్ట్ గా రాగా, మొత్తం ఎనిమిది భాగాలు ఉన్నట్లుగా ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

HIT 2: హిట్-2 విషయంలో మేకర్స్ ఆ తప్పు చేశారా..?

తాజాగా ఒక నెటిజెన్.. ‘సమంత లాంటి యాక్టర్ ని, ఫ్యూచర్ హిట్ సిరీస్ లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి అడివి శేషు రియాక్ట్ అవుతూ.. “అది ఒక అద్భుతమైన ఆలోచన. ఏమంటావు సమంత” అంటూ సమంతని ట్యాగ్ చేశాడు. దానికి సమంత బదులిస్తూ.. “ఓ రౌడీ పోలీస్, ఆలోచన నిజంగానే బాగుంది” అంటూ రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.

ఇక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషిలో ఉంది. త్వరలోనే హిందీ రిలీజ్ కూడా రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించగా.. తనికెళ్ళ భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, భాను చందర్ ప్రధానపాత్రలు పోషించారు. మరి మొదటి షో నుంచే హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.