Suma : 25వ పెళ్లి రోజున సుమ,రాజీవ్ చెప్పిన సీక్రెట్స్

సుమ-రాజీవ్ కపుల్ రీసెంట్‌గా 25వ పెళ్లిరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ వివాహబంధంలో సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు.

Suma

Suma : సుమ-రాజీవ్ జంట వారి వారి రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సుమ టీవీ షోలు తగ్గించుకుని తన సొంత యూట్యూబ్ ఛానెల్ మీద దృష్టి పెట్టారు. రాజీవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఈ కపుల్ 25వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుమ తన ఛానెల్‌లో భర్త రాజీవ్‌తో కలిసి సందడి చేసారు. వారి పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Mahesh Babu – Suma Kanakala : మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?

సుమ-రాజీవ్‌లది ప్రేమ వివాహం. వీరి పెళ్లికి మొదట్లో పెద్దలు అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకున్నారు. పెళ్లయ్యాక ఇద్దరు వారి వారి కెరియర్స్‌లో బిజీ అయిపోయారు. ఓవైపు పిల్లల బాధ్యతలు నెరవేరుస్తూనే కెరియర్‌లో ముందుకు సాగుతున్నారు. రీసెంట్‌గా వీరి కుమారుడు రోషన్ కూడా ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసాడు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10న ఈ జంట తమ 25వ పెళ్లిరోజు జరుపుకుంది. నిజానికి 1995 నుండి వీరి ప్రేమలో ఉన్నా 1999 లో వీరి వివాహమైందట. 30 సంవత్సరాల వీరి బంధాన్ని ఈ జంట ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నారు.

Suma

సుమ-రాజీవ్ దంపతులు ముందుగా సుమ తల్లి నుండి దీవెనలు అందుకుని తమ 25వ పెళ్లిరోజును వృద్ధాశ్రమంలో  పెద్దల మధ్యలో వేడుకగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి దండలు మార్చుకుని అక్కడి వారందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత సుమ సొంత యూట్యూబ్ ఛానెల్‌లో సరదాగా చిట్ చాట్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పెళ్లైన కొత్తలో మీ భార్యకు టైమ్ ఇవ్వండి.. ఆ తర్వాత ఇవ్వకపోయినా పర్లేదు.. ఎందుకంటే ఆ తర్వాత వాళ్లు రివేంజ్ తీర్చుకోవడం మొదలుపెట్టారంటే వేరేలా ఉంటుంది.. అంటూ రాజీవ్ సుమని ఉద్దేశించి అన్నారు. ఇంటికి వచ్చేస్తున్నానని చెబుతూ రాజీవ్ చాలాసార్లు అబద్ధాలు చెప్పి ఆలస్యంగా వచ్చేవారిని సుమ కంప్లైంట్ చేసారు. అందుకు రాజీవ్ సుమకి సారీ చెప్పారు. రాజీవ్ మొదటిసారి సారీ చెప్పారంటూ సుమ మురిసిపోయారు. పెళ్లైన తర్వాత భార్యాభర్తలు ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోవాలని ముఖ్యంగా పిల్లల విషయంలో బాధ్యతలు పంచుకోవాలని సుమ అన్నారు.

Suma – Kumari Aunty : కుమారి ఆంటీగా మారిపోయిన సుమ.. బ్రహ్మాజీకి కర్రీస్ అమ్ముతూ వీడియో..

మీరెప్పుడైనా తెలియకుండా ఒకరి ఫోన్ ఒకరు చెక్ చేసారా? అన్న ప్రశ్నకు సుమ చెక్ చేసానంటూ రాజీవ్‌కి షాక్ ఇచ్చారు. ఎప్పుడు చూసావు అంటూ రాజీవ్ అడగటం.. అందుకు సుమ ఇది జరిగి పది సంవత్సరాలు అయ్యిందని అయినా ఏమీ కనిపించలేదని చెప్పారు. అందుకు రాజీవ్ జాగ్రత్త పడటంలో కింగ్ నేను.. నీకు అర్ధం కాని పేర్లతో సేవ్ చేసాను.. అనగానే సుమ వైఫ్ లు.. జాగ్రత్త పడండి అంటూ నవ్వేసారు. 30 సంవత్సరాలకు పైగా తమని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సుమ-రాజీవ్‌లు షో ముగించారు. స్వీట్‌గా.. షార్ట్‌గా సుమ-రాజీవ్‌ల చిట్ చాట్ నవ్వుల పువ్వులు పూయించింది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు