Mahesh Babu – Suma Kanakala : మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?
ప్రొఫిషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో సక్సెస్‌ఫుల్ గా ముందుకు వెళ్తున్న మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?

mahesh babu namrata shirodkar suma Rajeev Kanakala
Mahesh Babu – Suma Kanakala : టాలీవుడ్ సెలబ్రిటీస్ కపుల్ మహేష్ బాబు నమ్రత, సుమ రాజీవ్ కనకాల.. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రొఫిషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో సక్సెస్‌ఫుల్ గా ముందుకు వెళ్తూ.. ఇప్పటి జనరేషన్ కపుల్స్ కి రోల్ మోడల్స్ అవుతున్నారు. అలాంటి ఈ రెండు జంటలు మధ్య ఒక చిన్న కనెక్షన్ ఉంది. అదేంటో మీకు తెలుసా..?
ఆ కనెక్షన్ మరేంటో కాదు.. ఈ రెండు జంటల వివాహం ఒకే తేదీలో జరిగాయి. సుమ, రాజీవ్ కనకాల వివహం.. 1999లో ఫిబ్రవరి 10న జరిగింది. నేటితో వీరి వివాహం అయ్యి 25 ఏళ్ళు అవుతుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. టెలివిజన్ రంగంలో పని చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ముందుగా రాజీవ్ కనకాల ప్రేమలో పడ్డారు. ఆ తరువాత సుమకి ప్రేమని తెలియజేయగా ఆమె ఒప్పుకున్నారు.
ఇక ఇన్నాళ్ల దాంపత్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఈ జంట మాత్రం.. తమ అన్యోన్య దాంపత్యంతోనే అన్నిటికి బదులిస్తూ ముందుకు సాగారు. ఇక ఈ 25 ఏళ్ళ ప్రయాణాన్ని సుమ గుర్తు చేసుకుంటూ.. ‘ఒకటిగా పాతికేళ్ళు’ అంటూ రాజీవ్ తో ఉన్న ఫొటో షేర్ చేశారు.
Also read : Devara : ఎన్టీఆర్ కోసం మరో నార్త్ భామ ఎంట్రీ.. దేవరలో మరాఠి భామ..
View this post on Instagram
ఇక మహేష్ బాబు, నమ్రత విషయానికి వస్తే.. వీరిద్దరి వివాహం 2005 ఫిబ్రవరి 10న జరిగింది. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే. ‘వంశీ’ సినిమాలో నమ్రత, మహేష్ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక సూపర్ స్టార్ కృష తనయుడు, టాలీవుడ్ హీరో మహేష్ బాబు, అలాగే బాలీవుడ్ హీరోయిన్ నమ్రత.. వివాహం అంటే ఏ రేంజ్ లో అవ్వాలి. అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరగాలి.
కానీ వీరి వివాహం.. ముంబైలోని ఓ హోటల్ లో సింపుల్ గా జరిగిపోయింది. ‘అతడు’ మూవీ షూటింగ్ సమయంలో ఈ పెళ్లి జరిగింది. ఇక ఈ జంట కూడా 19 ఏళ్ళ నుంచి ఒకటిగా ముందుకు సాగుతూ.. ప్రొఫిషనల్ అండ్ పర్సనల్ కెరీర్ లో ప్రతి ఒక్కరికి ఆదర్శం అవుతున్నారు. మహేష్ బాబు కూడా తమ ఇన్నాళ్ల దాంపత్యం గురించి ఇన్‌స్టాలో పోస్టు వేశారు. “ప్రేమ, నవ్వుల్లో, జీవితంలో ఎన్నో అందమైన మూమెంట్స్ లో మనిద్దరం పార్ట్నర్స్. హ్యాపీ యానివర్సరీ” అంటూ నమ్రతకి విషెస్ తెలియజేసారు మహేష్.
View this post on Instagram