Devara : ఎన్టీఆర్ కోసం మరో నార్త్ భామ ఎంట్రీ.. దేవరలో మరాఠి భామ..

దేవర సినిమాలో ఎన్టీఆర్ కోసం మరో నార్త్ భామని తీసుకు వస్తున్న కొరటాల శివ.

Devara : ఎన్టీఆర్ కోసం మరో నార్త్ భామ ఎంట్రీ.. దేవరలో మరాఠి భామ..

North Actress Shruti Marathe get chance in NTR Devara movie

Devara : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా రూపొందుతుంది. ఇక ఈ మూవీలో భారీ స్టార్ కాస్టింగ్ నటిస్తుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తుంటే.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

అయితే ఇప్పుడు ఈ స్టార్ కాస్టింగ్ లో మరో అందాల భామ కూడా వచ్చి జాయిన్ అవ్వబోతుందట. మరాఠి సినిమాల్లో నటించే ‘శృతి మరాఠే’.. దేవరలో ఎన్టీఆర్ కి జోడిగా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఫాదర్ అండ్ సన్‌గా రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. కొడుకు పాత్రకి జోడిగా జాన్వీని ఎంపిక చేసిన మూవీ టీం.. ఫాదర్ రోల్‌కి జోడిగా శృతి మరాఠేని సెలెక్ట్ చేసినట్లు సమాచారం.

Also read : Jyothi Rai : ఎదపై స్పెషల్ టాటూతో జగతి మేడం.. ఆ టాటూ మీనింగ్ ఏంటో తెలుసా?

కాగా శృతి మరాఠే.. సౌత్‌లో తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ నటించారు. ఇప్పుడు ఈ వార్త నిజమైతే, దేవరతో తెలుగు ఎంట్రీ షురూ అవుతుంది. ఇక దేవర రిలీజ్ విషయానికి వస్తే.. ఇంకా సస్పెన్స్ నెలకుంది. దేవర పార్ట్ 1ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి రావడం కష్టమని తెలుస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ లేటు అవ్వడంతో మూవీని పోస్టుపోన్ చేయనున్నారట.

ఇటీవల దిల్ రాజు ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘దేవర సినిమా ఏప్రిల్ 5 నుంచి పోస్టుపోన్ అయితే, ఆ తేదికి మా ఫ్యామిలీ స్టార్ ని తీసుకు వస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఫ్యామిలీ స్టార్‌ని ఏప్రిల్ 5కి తీసుకు వచ్చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. దీంతో దేవర పోస్టుపోన్ కన్ఫార్మ్ అయ్యిపోయినట్లు తెలుస్తుంది. అయితే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.