Jyothi Rai : ఎదపై స్పెషల్ టాటూతో జగతి మేడం.. ఆ టాటూ మీనింగ్ ఏంటో తెలుసా?

జగతి మేడమ్‌గా ఎంతో ఫేమ్ తెచ్చుకున్న నటి జ్యోతి రాయ్.. తన ఎదపై వేయించుకున్న టాటూ వీడియోతో వైరల్ అవుతున్నారు. ఇంతకీ ఏం టాటూ వేయించుకున్నారంటే?

Jyothi Rai : ఎదపై స్పెషల్ టాటూతో జగతి మేడం.. ఆ టాటూ మీనింగ్ ఏంటో తెలుసా?

Jyothi Rai

Updated On : February 10, 2024 / 2:36 PM IST

Jyothi Rai : జ్యోతి రాయ్ అనేకంటే ‘జగతి’ మేడమ్ అంటే జనాలు ఠక్కున గుర్తుపట్టేస్తారు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటి జ్యోతి రాయ్ స్క్రీన్ కంటే సోషల్ మీడియాలోనే సెన్సేషన్ అని చెప్పాలి. సీరియల్స్‌లో చాలా పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూ ఫోటోలు షేర్ చేస్తారు. రీసెంట్‌గా ఈ నటి తన ఎదపై టాటూ వేయించుకున్నారు. ఎంతో పెయిన్‌ను భరిస్తూ వేయించుకున్న ఆ టాటూ ఏంటో తెలుసా?

Mahesh – Namrata : మహేష్ – నమ్రత వెడ్డింగ్ యానివర్సరీ.. ముద్దు పెడుతున్న ఫొటో షేర్ చేస్తూ..

జ్యోతి రాయ్ తుళు, కన్నడ, తమిళ, తెలుగు సీరియల్స్‌లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. హీరోకి తల్లి పాత్రలో వయసుకి మించి ఆమె పోషించిన పాత్రకు ఎంతో పేరొచ్చింది. రియల్ లైఫ్‌లో మాత్రం జ్యోతి రాయ్ భిన్నంగా ఉంటారు.  గ్లామర్ లుక్‌లో అందాల ఆరబోస్తూ ఈ బ్యూటీ పెట్టే ఫోటోలు చూసి జనాలు షాకవుతుంటారు. జ్యోతికి 20 సంవత్సరాల వయసులో పద్మనాభ అనే వ్యక్తితో వివాహమై విడిపోయారట. ప్రస్తుతం సుకు పూర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు పక్కన అతని పేరును కూడా యాడ్ చేసుకున్నారు.

Pooja Hegde : వామ్మో.. ఎంత పెద్ద పిజ్జానో.. పూజా హెగ్డే కోసం స్పెషల్‌గా..

జ్యోతి సీరియల్స్‌తో పాటు ‘ప్రెటీ గాళ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ప్రస్తుతం సుకు పూర్వజ్ డైరెక్షన్ లో ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమా చేస్తున్నారు. ఇవి ఇలా ఉంచితే తాజాగా జ్యోతి తన ఎదపై టాటూ వేయించుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఎంతో పెయిన్‌ను భరిస్తూ జ్యోతి వేయించుకున్న టాటూలో అందమైన సీతాకోక చిలుక.. దాని పక్కన హోప్ అనే ఇంగ్లీషు అక్షరాలు కనిపించాయి. తన ప్రేమికుడి కోసమే ఈ టాటూ వేయించుకున్నారని జ్యోతిని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతానికి సుకు పూర్వాజ్‌తో డేటింగ్ లో ఉన్న జ్యోతి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందా అని జనాలు వెయిట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)