Pooja Hegde : వామ్మో.. ఎంత పెద్ద పిజ్జానో.. పూజా హెగ్డే కోసం స్పెషల్‌గా..

తాజాగా పెద్ద పిజ్జాతో పూజా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.

Pooja Hegde : వామ్మో.. ఎంత పెద్ద పిజ్జానో.. పూజా హెగ్డే కోసం స్పెషల్‌గా..

Pooja Hegde shares Photos with a Big Pizza on World Pizza Day

Updated On : February 10, 2024 / 1:44 PM IST

Pooja Hegde : కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా తెలుగులో వరుస సినిమాలు చేసిన పూజాహెగ్డేకి ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సౌత్ లో సినిమాలు చేస్తున్న సమయంలో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేసింది. బాలీవుడ్ లో పూజా సినిమాలు పరాజయం కావడంతో ఇప్పుడు అక్కడ కూడా ఆఫర్లు కరువయ్యాయి ఈ బుట్టబొమ్మకి.

ఇటీవల చేతిలో ఉన్న రెండు తెలుగు సినిమాలు ఏవో కారణాలతో వదిలేసుకుంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో గతంలో ఒప్పుకున్న ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉంది. చేతిలో ఆఫర్స్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తుంది.

Also Read : Nirosha Radha : ‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించింది ఎవరో తెలుసా? ఒకప్పటి స్టార్ హీరోయిన్..

తాజాగా పెద్ద పిజ్జాతో(Pizza) పూజా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. నిన్న ఫిబ్రవరి 9 వరల్డ్ పిజ్జా డే కావడంతో ఓ పిజ్జా షాప్ లో మాములు పిజ్జా సైజుకి నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండే ఒక పిజ్జాని పట్టుకొని పూజా హెగ్డే ఫోటోలకు పోజులిచ్చింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటూ సరదాగా పోస్ట్ చేసింది. దీంతో పిజ్జాతో పూజాహెగ్డే ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొందరు సరదాగా పూజా హెగ్డే కాదు పిజ్జా హెగ్డే అని కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)