Mahesh – Namrata : మహేష్ – నమ్రత వెడ్డింగ్ యానివర్సరీ.. ముద్దు పెడుతున్న ఫొటో షేర్ చేస్తూ..

తాజాగా నేడు మహేష్ - నమ్రత వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఇద్దరూ స్పెషల్ పోస్ట్ లు పెట్టి ఒకరికొకరు విషెష్ చెప్పుకున్నారు.

Mahesh – Namrata : మహేష్ – నమ్రత వెడ్డింగ్ యానివర్సరీ.. ముద్దు పెడుతున్న ఫొటో షేర్ చేస్తూ..

Mahesh Babu and Namrata Shirodkar wishes each other on their Wedding Anniversary

Updated On : February 10, 2024 / 2:25 PM IST

Mahesh – Namrata : టాలీవుడ్ స్టార్ కపుల్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ జంటకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరి ప్రేమ, పెళ్లి జీవితం చూసిన వారంతా అభినందిస్తారు. పెళ్లయి ఇన్నేళ్ళవుతున్న ఇంకా క్యూట్ గా, హ్యాపీగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ జంట. ఇక ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో స్పెషల్ డేస్ లో స్పెషల్ పోస్టులు పెడుతూనే ఉంటారు.

తాజాగా నేడు మహేష్ – నమ్రత వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఇద్దరూ స్పెషల్ పోస్ట్ లు పెట్టి ఒకరికొకరు విషెష్ చెప్పుకున్నారు. ఇది వీరిద్దరికి 19వ వెడ్డింగ్ యానివర్సరీ. నమ్రత గతంలో మహేష్ కి బుగ్గపై ముద్దు పెడుతున్న ఓ పాత ఫోటోని షేర్ చేస్తూ.. ప్రేమ, నవ్వుల్లో, జీవితంలో ఎన్నో అందమైన మూమెంట్స్ లో మనిద్దరం పార్ట్నర్స్. హ్యాపీ యానివర్సరీ నమ్రత అని రాసుకొచ్చాడు మహేష్.

Also Read : Pooja Hegde : వామ్మో.. ఎంత పెద్ద పిజ్జానో.. పూజా హెగ్డే కోసం స్పెషల్‌గా..

ఇక నమ్రత కూడా మహేష్ తో గతంలో క్లోజ్ గా దిగిన ఫొటో షేర్ చేసి.. ఇంకో సంవత్సరం ప్రేమ, సంతోషం నీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది ఎప్పటికి ఉంటుంది మహేష్ అని పోస్ట్ చేసింది. దీంతో మహేష్, నమ్రతల పోస్టులు వైరల్ అవుతుండగా అభిమానులు, నెటిజన్లు ఈ ఇద్దరికీ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.