Suma – Kumari Aunty : కుమారి ఆంటీగా మారిపోయిన సుమ.. బ్రహ్మాజీకి కర్రీస్ అమ్ముతూ వీడియో..

కుమారి ఆంటీగా మారిపోయిన సుమ ఫుడ్‌స్టాల్ పెట్టి బ్రహ్మాజీకి కర్రీస్ అమ్ముతూ..

Suma – Kumari Aunty : కుమారి ఆంటీగా మారిపోయిన సుమ.. బ్రహ్మాజీకి కర్రీస్ అమ్ముతూ వీడియో..

Anchor Suma as Kumari Aunty instagram reel with actor Brahmaji

Updated On : February 9, 2024 / 10:03 AM IST

Suma – Kumari Aunty : ఒకప్పుడు సెలబ్రిటీస్ చేసిన విషయాలను ఆడియన్స్ చేసి వైరల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆడియన్స్ చేసే పనులను సెలబ్రిటీస్ తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు. సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు సైతం.. తన మూవీ కోసం ఓ తాత మాట్లాడిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే పదాన్ని ఉపయోగించుకోవడం గమనార్హం. మహేష్ మాత్రమే కాదు టాలీవుడ్ లోని చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు.

ఈమధ్య కాలంలో కుమారి ఆంటీ అనే ఫుడ్ స్టాల్ వ్యాపారి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె గురించి మాట్లాడడంతో.. టాలీవుడ్ మేకర్స్ కుమారి ఆంటీ ఫేమ్ ని ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశారు. ఈక్రమంలోనే ఇటీవల సందీప్ కిషన్ తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం, అలాగే బిగ్‌బాస్ ఉత్సవ్ సెలబ్రేషన్స్ లో కుమారి ఆంటీ కనిపించారు.

Also read : Chiranjeevi : ఇంటర్నేషనల్ అవార్డుల్లో మరోసారి ఇండియా మ్యూజిషన్స్ రీసౌండ్.. చిరు అభినందన ట్వీట్..

ఇప్పుడు టాలీవుడ్ యాంకర్ సుమ.. కుమారి ఆంటీ మాటలతో ఓ ఇన్‌స్టా రీల్ చేశారు. ఈ రీల్ లో బ్రహ్మాజీని కూడా మిక్స్ చేస్తూ మాష్ అప్ వీడియో చేశారు. ఇక ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ రీల్ చూసిన దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత.. స్మైల్ ఎమోజిలతో కామెంట్ చేశారు. అయితే నెటిజెన్స్ అంతా బ్రహ్మాజీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.

బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉంటారు. ఆయన చేసే ట్వీట్స్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతి విషయాన్ని చాలా కామిక్ గా ట్వీట్ చేసే బ్రహ్మాజీ.. ఇప్పుడు సుమ తన పై చేసిన ఆ వీడియో పై ఎలా స్పందిస్తారో అని ఎదురు చూస్తున్నారు. మరి బ్రహ్మాజీ రియాక్షన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఈలోపు సుమ చేసిన ఆ రీల్ వైపు ఓ లుక్ వేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)