Chiranjeevi : ఇంటర్నేషనల్ అవార్డుల్లో మరోసారి ఇండియా మ్యూజిషన్స్ రీసౌండ్.. చిరు అభినందన ట్వీట్..

ప్రముఖ మ్యూజిక్ అవార్డుల వేడుక 'గ్రామీ అవార్డు' వేడుకల్లో ఇండియన్ మ్యూజిషన్స్ మరోసారి రీసౌండ్ చేశారు. అవార్డు అందుకున్న మ్యూజిషన్స్ ని అభినందిస్తూ చిరు ట్వీట్.

Chiranjeevi : ఇంటర్నేషనల్ అవార్డుల్లో మరోసారి ఇండియా మ్యూజిషన్స్ రీసౌండ్.. చిరు అభినందన ట్వీట్..

Chiranjeevi congratulate to Shankar Mahadevan Zakir Hussain for winning grammy awards

Updated On : February 9, 2024 / 9:38 AM IST

Grammy Awards : ఇండియన్ కళాకారులంతా ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతూ మన దేశ జెండాని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేస్తున్నారు. ఇంటర్నేషనల్ అవార్డుల బరిలో ప్రపంచప్రఖ్యాతి కళాకారులతో పోటీ పడి విజయకేతనం ఎగరవేస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్ అవార్డుల వేడుక ‘గ్రామీ అవార్డు’ వేడుకల్లో ఇండియన్ మ్యూజిషన్స్ మరోసారి రీసౌండ్ చేశారు.

భారతీయ అద్భుత సంగీతకారులు.. శంకర్ మహదేవన్, సెల్వగణేష్ వినాయక్, గణేష్ రాజగోపాలన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కలయికలో ‘శక్తి’ అనే పేరుతో ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ ఆల్బమ్ లో మొత్తం ఎనిమిది సాంగ్స్ ఉన్నాయి. శంకర్ మహదేవన్ స్వరం, జాకీర్ హుస్సేన్ తబలా, వి సెల్వగణేష్ పెర్కషన్, జాన్ మెక్‌లాఫ్లిన్ గిటార్, రాజగోపాలన్ వయోలిన్.. మ్యూజిక్ లవర్స్ ని మైమరపించాయి.

Also read : Lal Salaam Twitter Review : రజినీకాంత్ ‘లాల్ స‌లామ్‌’ ట్విట్టర్ టాక్ ఏంటి.. ఆడియన్స్ ఏమంటున్నారు..?

ఇక సూపర్ హిట్టుగా నిలిచిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ 66వ గ్రామీ అవార్డులకు ఎంపిక అయ్యింది. ఆ పోటీలో ప్రపంచప్రఖ్యాతి కళాకారులు సుసానా బాకా, బోకాంటే, బర్నా బాయ్, డేవిడో వంటి వారితో పోటీ పడి.. మన మ్యూజిషన్స్ ‘గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుని సొంతం చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ అవార్డుల వేడుకలో నలుగురు భారతీయ సంగీతకారులు అవార్డుని అందుకున్నారు. కాగా జాకీర్ హుస్సేన్ కి ఇది రెండవ గ్రామీ అవార్డు.

Chiranjeevi congratulate to Shankar Mahadevan Zakir Hussain for winning grammy awards

ఇక ఈ అవార్డుని గెలుచుకున్న సంగీతకారులకు ప్రతిఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రామీ అవార్డు గెలుచుకున్న వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. భారత జెండా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది. గ్రామీ అవార్డు అందుకున్న నలుగురు సంగీతకారులకు నా అభినందనలు. ముఖ్యంగా నాకు పాటలు పాడిన శంకర్ మహదేవన్ కి ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కి థాంక్యూ చెబుతూ శంకర్ మహదేవన్ కూడా రీ ట్వీట్ చేశారు.