Sekhar Master : శేఖర్ మాస్టర్ మదర్‌ని చూశారా.. అమ్మతో కలిసి స్టేజిపై డాన్స్ వీడియో వైరల్..
శేఖర్ మాస్టర్ మదర్‌ని చూశారా..? చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి గొప్ప డాన్సర్స్ కి డాన్స్ కోరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ తన తల్లితో కలిసి..

Sekhar Master dance with his mother video gone viral
Sekhar Master : టాలీవుడ్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్.. శేఖర్ మాస్టర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెండితెర పై స్టార్ హీరోలకు డాన్స్ కోరియోగ్రఫీ చేస్తూనే.. బుల్లితెరపై యువ డాన్సర్స్ ని జడ్జి చేస్తూ వారి కెరీర్ కి గురువు అవుతున్నారు. వెండితెరపై కెమెరా వెనుక ఉండే శేఖర్ మాస్టర్.. ఈ బుల్లితెర షోలతో కెమెరా ముందు అలరిస్తూ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.
ఈ టీవీ షోలు కేవలం శేఖర్ మాస్టర్ ని మాత్రమే కాదు, ఆయన కుటుంబసభ్యులను కూడా ఆడియన్స్ కి పరిచయం చేసి.. తమ ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా ప్రేక్షకుల ప్రేమ దక్కేలా చేశాయి. ఇప్పటికే శేఖర్ మాస్టర్ భార్య, పిల్లలు ఆడియన్స్ ముందుకు వచ్చారు. శేఖర్ మాస్టర్ వారసులు సాహితి, విన్నీ.. తండ్రి లాగానే డాన్స్ తో ఆడియన్స్ ని మెప్పించి ఇప్పుడే అభిమానులను సంపాదించుకున్నారు. కొడుకు విన్నీ అయితే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశారు. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నాడు.
Also read : True Lover : ‘ట్రూ లవర్’ మూవీ.. ఆ ఓటిటి అండ్ టీవీ ఛానల్‌లోనే ప్రసారం కాబోతుంది..
శేఖర్ మాస్టర్ కుటుంబంలోని ఈ ముగ్గురు అందరికి పరిచయమే. కానీ శేఖర్ మాస్టర్ లాంటి గొప్ప డాన్సర్ ని ఇండస్ట్రీకి ఇచ్చిన అమ్మ ఎవరు అన్నది మాత్రం ఎవరికి తెలియదు. తాజాగా శేఖర్ మాస్టర్ తన తల్లిని అందరికి పరిచయం చేశారు. ఈ మాస్టర్ జడ్జిగా వ్యవహరించే డాన్స్ షో ‘ఢీ’కి.. శేఖర్ అమ్మ గెస్ట్ గా వచ్చారు. వాలెంటైన్ డే స్పెషల్ షోకి అతిథిగా వచ్చిన శేఖర్ అమ్మ కొడుకుతో కలిసి డాన్స్ వేశారు.
చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి గొప్ప డాన్సర్స్ కి డాన్స్ కోరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్.. తన తల్లితో కలిసి ఢీ స్టేజి పై డాన్స్ వేసి ఎంతో ఆనంద పడ్డారు. అలాగే ఇదే ఎపిసోడ్ లో వాలెంటైన్ డే సందర్భంగా తన వైఫ్ సుజాతకి కాల్ చేసి ‘ఐ లవ్ యూ’ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram