Vivo V70 Series : వివో ఫ్యాన్స్ మీకోసమే.. ఖతర్నాక్ ఫీచర్లతో రెండు కొత్త వివో ఫోన్లు.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo V70 Series : వివో V70 సిరీస్ రాబోతుంది. అద్భుతమైన ఫీచర్లతో వివో V70, వివో V70 ఎలైట్ సిరీస్ ఫీచర్లతో ఈ నెల 19న లాంచ్ కానుంది.. పూర్తి వివరాలివే..
Vivo V70 Elite
- ఫిబ్రవరి 19న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఆన్లైన్ స్టోర్ ద్వారా వివో V70 సిరీస్ లాంచ్
- వివో V70 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4, వివో V70 ఎలైట్ జైస్-ట్యూన్డ్ కెమెరాలతో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3
- వివో V70 రూ. 40వేల కన్నా తక్కువ, V70 ఎలైట్ రూ. 50వేల కన్నా తక్కువ
Vivo V70 Series : వివో ఫ్యాన్స్ కోసం అద్భుత ఫోన్లు రాబోతున్నాయి. వివో ఇప్పుడు భారత మార్కెట్లో కొత్త వివో V70 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో V70, వివో V70 ఎలైట్ ఫిబ్రవరి ఆఖరులో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.
ఈ ఫోన్లు ఆకర్షణీయమైన డిజైన్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, కెమెరా-ఫోకస్డ్ ఫీచర్లతో పాటు అల్ట్రా-స్లిమ్ బెజెల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ అందించనున్నాయి. ఈ ఫోన్లలో జైస్-ట్యూన్డ్ కెమెరాలను కూడా ఉంటాయి. వివో V70, V70 ఎలైట్ భారత్ లాంచ్ తేదీ, స్పెషిఫికేషన్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో V70, వివో V70 ఎలైట్ లాంచ్ తేదీ (అంచనా) :
ఫిబ్రవరి 19న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో వివో V70 సిరీస్ లాంచ్ అవుతుందని వివో ధృవీకరించింది. ఈ స్మార్ట్ఫోన్లలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. త్వరలోనే ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.
వివో V70, వివో V70 ఎలైట్ స్పెసిఫికేషన్లు :
వివో V70, వివో V70 ఎలైట్ ఫోన్లు రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్‌తో రానున్నాయి. వివో V70 స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ద్వారా పవర్ పొందుతుంది. అయితే, వివో V70 ఎలైట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్లలో 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్‌లతో 6,500mAh బ్యాటరీతో వస్తాయని అంచనా.
50MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని జీఈఐఎస్ఎస్ బ్యాక్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుందని అంటున్నారు. 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 16-ఆధారిత స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతాయి. 4 మెయిన్ ఆండ్రాయిడ్ OS అప్ డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను పొందవచ్చు.
వివో V70, వివో V70 ఎలైట్ ధర (అంచనా) :
వివో ఇంకా అధికారిక ధరను వెల్లడించలేదు. వివో V70 ధర రూ. 40వేల లోపు అందుబాటులో ఉండనుంది. వివో V70 ఎలైట్ రూ. 50వేల లోపు సెగ్మెంట్లో ఉండొచ్చు.
