Google Pixel 10a : పిక్సెల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కొత్త పిక్సెల్ 10a ఫోన్ వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చంటే?
Google Pixel 10a : గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోంది.. ఈ నెల 18న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కీలక ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి.
Google Pixel 10a
- గూగుల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10a లాంచ్‌పై అధికారిక ప్రకటన
- ఫోన్ ఫుల్ డిజైన్ 15 సెకన్ల షార్ట్ వీడియో షేర్ చేసిన కంపెనీ
- ఫిబ్రవరి 18 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం
Google Pixel 10a : పిక్సెల్ ఫోన్ అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. గూగుల్ రాబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10aకు సంబంధించి అధికారికంగా వీడియోను విడుదల చేసింది.
ఈ పిక్సెల్ ఫోన్ ఫుల్ డిజైన్‌తో 15 సెకన్ల షార్ట్ వీడియోను కంపెనీ షేర్ చేసింది. టీజర్ ధర లేదా స్పెసిఫికేషన్లను రివీల్ చేయలేదు. కానీ, ఫిబ్రవరి 18 నుంచి ఈ పిక్సెల్ 10a ఫోన్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని వెల్లడించింది. పిక్సెల్ 10a గత పిక్సెల్ 9a మాదిరిగానే కనిపిస్తుంది. ఇందులో ఫ్లాట్ సైడ్లు, సర్కిల్ కార్నర్స్, క్లీన్ ఎండ్ ఆప్షన్లు ఉన్నాయి.
గత ఏడాది ఆగస్టులో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైనప్‌లో 3 స్మార్ట్ఫోన్లు, ఒక ఫోల్డబుల్ ఫోన్ ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10ఎ ఫోన్ లైనప్‌లో అత్యంత ఆకర్షణీయంగా ఉండనుంది. పిక్సెల్ ఫోన్ కోరుకునే యూజర్ల కోసం కంపెనీ తీసుకువస్తోంది. స్పెసిఫికేషన్ల నుంచి ధర వరకు పిక్సెల్ 10a ఫోన్ ఎలా ఉండబోతుందో లీక్ డేటా వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 6.3-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని భావిస్తున్నారు. హుడ్ కింద, ఫోన్ గూగుల్ టెన్సర్ జీ4 చిప్సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది.
8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా, ఈ పిక్సెల్ ఫోన్ 23W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,100mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 10aలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరా కూడా ఉండవచ్చు.
భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10a ధర (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 10a ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.49,999 ఉంటుందని అంచనా. 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.69,000 ఉండొచ్చు.
