Shah Rukh Khan : నాకంటే సల్మాన్ ఖాన్ గొప్ప.. షారుఖ్ ఖాన్ ట్వీట్!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పఠాన్'. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజుల నుండి ట్విట్టర్ లో అభిమానులతో షారుఖ్ ఇంటరాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
- gum 95921
- Published On : January 29, 2023 / 06:31 PM IST
shah rukh salman
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘పఠాన్’. ఇటీవల రిలీజ్ అయ్యిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులు ఎదురుకున్న ఈ మూవీ, రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది సల్మాన్ ఖాన్ అతిధి పాత్ర. ఈ గెస్ట్ రోల్ మూవీని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది.
Pathaan : పఠాన్ ఆ సినిమాల టార్గెట్స్ కొల్లగొడుతుందా?? టార్గెట్ @1000 కోట్లు??
కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజుల నుండి ట్విట్టర్ లో అభిమానులతో షారుఖ్ ఇంటరాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక నెటిజెన్.. ‘పఠాన్ అద్భుతమైన కలెక్షన్స్ సాదిస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మీరు సల్మాన్ ఖాన్ క్యామియోని కొలవేలినిది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి షారుఖ్ ఖాన్ బదులిస్తూ.. ‘సల్మాన్ ఖాన్ నాకంటే గొప్ప. ఈ రోజుల్లో యూత్ అంతా దీనిని GOAT అనిపిలుస్తున్నారు కదా’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చూస్తున్న సమయంలో పఠాన్ సినిమా కలెక్షన్స్ హిందీ పరిశ్రమకి మళ్ళీ ప్రాణం పోసింది. అంతేకాదు షారుఖ్ అభిమానులకు కూడా ఈ సినిమా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దాదాపు నాలుగేళ్ళగా షారుఖ్ ఖాన్ ప్రతి సినిమా ప్లాప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇంతటి హిట్టు అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వచ్చే వారంలో కూడా బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ లేకపోవడంతో ఈ మూవీ రూ.1000 కోట్లు సాధిస్తుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి చూడాలి షారుఖ్ ఆ మార్క్ అందుకుంటాడా? లేదా? అని.
Salman bhai is…woh kya kehte hain aaj kal…young log…haan….GOAT. ( greatest of all time ) #Pathaan https://t.co/91HJy8UZxU
— Shah Rukh Khan (@iamsrk) January 28, 2023
