Shah Rukh Khan : క్యాన్సర్తో బాధపడుతున్న అభిమాని కోరిక తీర్చిన షారుఖ్.. 40 నిమిషాలు వీడియో కాల్!
కోల్కతాకు చెందిన శివానీ చక్రవర్తి అనే షారుఖ్ అభిమాని క్యాన్సర్ తో బాధ పడుతుంది. మరి కొన్ని నెలలు మాత్రమే ఆమె బ్రతికి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న షారుఖ్..
- gum 95921
- Published on- May 23, 2023 / 09:20 PM IST
Shah Rukh Khan fulfill his fan wish who suffering from cancer
Shah Rukh Khan Video Call : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని కోరిక తెలుసుకొని ఆ కోరికని నెరవేర్చాడు. కోల్కతాకు చెందిన శివానీ చక్రవర్తి అనే 60 ఏళ్ళ మహిళ.. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడింది. దాని పై పోరాడుతూ వస్తున్న ఆమె.. ఇప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజిని ఎదురుకుంటుంది. మరి కొన్ని నెలలు మాత్రమే ఆమె బ్రతికి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఆమెకు షారుఖ్ ఖాన్ అంటే ఎంతో అభిమానం.
Suhana Khan : మా నాన్న వల్ల వచ్చే గుర్తింపు నాకు అవసరం లేదు.. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా!
షారుఖ్ ని ఒక్కసారైనా కలవాలని, తన చేతివంటని షారుఖ్ రుచి చూపించాలని ఎంతో ఆశపడేది. ఇక ఆమె కోరిక తెలుసుకున్న ఆమె కూతురు ఎలాగైనా ఆ కోరిక నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదికాస్త షారుఖ్ వరకు చేరుకోవడంతో.. ఆ అభిమాని కోరిక తీర్చేందుకు షారుఖ్ స్వయంగా వీడియో కాల్ చేసి శివానీ చక్రవర్తిను సంతోషపరిచాడు. దాదాపు 40 నిముషాలు పాటు ఆమెతో వీడియో కాల్ మాట్లాడాడు. అలాగే త్వరలోనే తన ఇంటికి వస్తానని, తన చేతి వంట తింటానని శివానీకి మాట ఇచ్చాడు.
Shah Rukh Khan : ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసిన అధికారి.. షారుఖ్ ఖాన్ నుంచి లంచం తీసుకున్నాడు!
అలాగే ఆమె క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఆర్ధిక సహాయం చేస్తానంటూ కూడా మాట ఇచ్చాడు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షారుఖ్ ని నెటిజెన్స్ అందరు అభినందిస్తున్నారు. కాగా షారుఖ్ ప్రస్తుతం జవాన్ (Jawan), డంకీ (Dunki) సినిమాల్లో నటిస్తున్నాడు. జవాన్ సినిమాని సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలోనే అల్లు అర్జున్ కూడా గెస్ట్ రోల్ ఉండబోతుందని తెలుస్తుంది.
