Ram Charan : షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు.. తన మూవీలోని డైలాగ్‌ని చెప్పాడు.. వీడియోతో క్లారిటీ..
అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని మాత్రమే చెప్పాడు. ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన షారుఖ్ అభిమానులు.
- gum 95921
- Updated on- March 5, 2024 / 05:01 PM IST
Shah Rukh Khan not insulting Ram Charan he is just saying his movie dialogue
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి దాదాపు బాలీవుడ్ లోని అందరూ స్టార్స్ హాజరుకాగా.. సౌత్ నుంచి రజినీకాంత్, రామ్ చరణ్, అట్లీ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో ఈ స్టార్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈక్రమంలోనే స్టేజి పై నాటు నాటు సాంగ్ కి బాలీవుడ్ ఖాన్‌త్రయం షారుఖ్, ఆమిర్, సల్మాన్ డాన్స్ వేసిన వీడియో బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యింది. ఆ డాన్స్ సమయంలోనే షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ ని వేదిక మీదకి పిలిచి.. నాటు నాటు స్టెప్ ని ఖాన్స్ అందరూ కలిసి చరణ్ తో వేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా బయటకి వచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
Also read : Varun Tej : టాలీవుడ్లో మొదలైన కొత్త ట్రెండ్‌తో.. ఒక మంచి పని జరిగిందంటే.. అది వరుణ్ వల్లే.. ఏంటది..!
అయితే ఆ వీడియోలో షారుఖ్, రామ్ చరణ్ ని పిలిచేటప్పుడు.. ఇడ్లీ వడ రామ్ చరణ్ అంటూ సంబోధించారు. షారుఖ్ ఇలా మాట్లాడడంతో కొంతమంది టాలీవుడ్ ఆడియన్స్.. షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించాడు అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో షారుఖ్ సారీ చెప్పాలంటూ పేర్కొంటున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు. తన మూవీలోని డైలాగ్‌ని చెబుతూ రామ్ చరణ్ పిలిచాడంటూ షారుఖ్ ఫ్యాన్స్ ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ నటించిన ‘వన్ 2 కా 4’ మూవీలో షారుఖ్ ఒక డైలాగ్ చెబుతారు. ఆ డైలాగ్ లో సౌత్ లో ఫేమస్ అయిన వాటి గురించి మాట్లాడుతూ.. ఇడ్లీ, వడ, రజినీకాంత్, వెంకటేష్, నాగార్జున అంటూ సంబోధిస్తారు. ఆ డైలాగ్ నే అంబానీ ఈవెంట్ లో చరణ్ ని పిలిచేటప్పుడు షారుఖ్ ఉపయోగించారు. రజిని పేరు స్థానంలో రామ్ చరణ్ పేరుని పెట్టి షారుఖ్ ఆ డైలాగ్ చెప్పారు. అయితే సౌత్ ఆడియన్స్ కి ఆ డైలాగ్ గురించి తెలియకపోవడంతో.. చరణ్ ని అవమానించారని భావించి తెగ ఫీల్ అయ్యిపోయారు.
