Shah Rukh Khan : అల్లు అర్జున్ ట్వీట్‌కి షారుఖ్ రిప్లై.. ఫైరే నన్ను పొగుడుతుంది..
అల్లు అర్జున్ ట్వీట్ షారుఖ్ ఖాన్ ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవుతుంది.
- gum 95921
- Published on- September 14, 2023 / 03:34 PM IST
Shah Rukh Khan reply to Allu Arjun Tweet on Jawan
Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ (Jawan). తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు. అనిరుద్ సంగీతం అందించాడు. ఇక ఈ మూవీ పై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మహేష్ బాబు, రాజమౌళి వంటి స్టార్స్ జవాన్ పై సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం.. వాటికీ షారుఖ్ కూడా బదులివ్వడం జరుగుతుంది.
Naga Chaitanya : స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి నాగచైతన్య ఎంట్రీ.. బ్లాక్ బర్డ్‌కి ఓనర్‌గా..
ఇక నేడు ఈ మూవీ చూసి అల్లు అర్జున్ (Allu Arjun) ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో షారుఖ్ మాస్ అవతార్ అని, మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు పొగిడేస్తూ రాసుకొచ్చాడు. తాజాగా ఈ ట్వీట్ కి షారుఖ్ నుంచి బదులిచ్చింది. “స్వాగ్ విషయంలో పుష్ప ది ఫైరే నన్ను పొగుడుతుంది. ఈరోజు ఎప్పటికి మర్చిపోలేను. పుష్పని డే మూడుసార్లు చూసి ఉంటాను నేను. నిన్న పర్సనల్ గా కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
Devara : దేవర యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రపంచంలోనే ఖరీదైన..
అలాగే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా రియాక్ట్ అవుతూ.. థాంక్యూ చెప్పాడు. దానికి బన్నీ బదులిస్తూ.. “థాంక్యూ ఒకటే సరిపోదు. నాకు మంచి మ్యూజిక్ కూడా కావాలి” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన ఆడియన్స్.. అట్లీతో మూవీ ఓకే అయ్యిపోయిందని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇటీవల అట్లీ.. అల్లు అర్జున్ కి ఒక స్టోరీ వినిపించినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
