Devara : దేవర యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రపంచంలోనే ఖరీదైన..

ఎన్టీఆర్ దేవర సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం కళ్యాణ్ రామ్ ప్రపంచంలోనే ఖరీదైన..

Devara : దేవర యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రపంచంలోనే ఖరీదైన..

costliest camera used for NTR Devara under water sequence

Updated On : September 14, 2023 / 1:12 PM IST

Devara : RRR తర్వాత ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న సినిమా ‘దేవ‌ర‌'(Devara). కొరటాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వం ఆవహిస్తున ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan), మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం హాలీవుడ్ మేకర్స్ సైతం రంగంలోకి దించుతున్నారు.

800 Movie : ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది..

హాలీవుడ్ మూవీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్’కు యాక్షన్ పార్ట్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ ‘కెన్నీ బెట్స్’, ఆక్వా మ్యాన్ సినిమాకి VFX డిజైనర్ గా వర్క్ చేసిన ‘బ్రాడ్ మిన్నిచ్’ని ఈ సినిమా కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కోసం ప్రపంచంలోనే ఖరీదైన కెమెరాని ఉపయోగిస్తున్నారట. ఈ మూవీలోని అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడానికి “ARRI ALEXALF AND ARRI SIGNATURE PRIME LENS” ఉపయోగిస్తున్నారట. ఈ కెమెరా వాడడం వల్ల సినిమాలో విజువల్స్ ఓ రేంజ్ లో కనిపించనున్నాయి.

Harsha Sai : హీరోగా యూట్యూబర్ హర్ష సాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ..

కాగా ఎన్టీఆర్ తాజాగా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్తున్నాడు. అక్కడ జరగబోయే SIIMA అవార్డుల వేడుకలో పాల్గొనబోతున్నాడు. RRR చిత్రానికి గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్తున్నాడు. అవార్డుల అనంతరం ఫ్యామిలీతో కొన్ని రోజులు అక్కడే ఎంజాయ్ చేయనున్నాడని సమాచారం.