Vijay Deverakonda : స్టేజిపై విజయ్ దేవరకొండకు ముద్దు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో.. అర్జున్ రెడ్డి లేకపోతే..
కబీర్ సింగ్ చేసిన షాహిద్ కపూర్, అర్జున్ రెడ్డి చేసిన విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే స్టేజిపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.
- Saketh U
- Updated on- March 20, 2024 / 07:31 AM IST
Shahid Kapoor Kiss To Vijay Deverakonda on Amazon Stage for Arjun Reddy Movie
Vijay Deverakonda : సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో 2017లో విజయ్ దేవరకొండ, షాలిని పాండే(Shalini Pandey) జంటగా వచ్చిన అర్జున్ రెడ్డి(Arjun Reddy) భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ తన దర్శకత్వంలోనే కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి తెరకెక్కించాడు.
షాహిద్ కపూర్(Shahid Kapoor), కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన కబీర్ సింగ్ 2019 లో రిలీజయి బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టి ఏకంగా 250 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. సందీప్ వంగ ఈ రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయి బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ దక్కించుకున్నాడు. ఈ రెండు సినిమాలతోనే షాహిద్ కపూర్, అర్జున్ రెడ్డి కూడా స్టార్స్ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు.
Also Read : Mahesh Babu Foundation : గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల కోసం.. 300 మంది వ్యక్తులతో MB ఫౌండేషన్..
నిన్న మార్చ్ 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఓ ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కబీర్ సింగ్ చేసిన షాహిద్ కపూర్, అర్జున్ రెడ్డి చేసిన విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే స్టేజిపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.
స్టేజిపై షాహిద్ కపూర్.. విజయ్ దేవరకొండని పట్టుకొని మాట్లాడుతూ.. విజయ్ కి చాలా ప్రేమని ఇవ్వాలి. విజయ్ అర్జున్ రెడ్డి చేయకపోతే నా కబీర్ సింగ్ సినిమా లేదు అంటూ విజయ్ బుగ్గపై ముద్దు పెట్టాడు షాహిద్ కపూర్. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక విజయ్ అభిమానులు మాత్రం బాలీవుడ్ లో విజయ్ ని ఆ రేంజ్ లో పొగుడుతున్నారు అంటూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. విజయ్ రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ థియేటర్లో రిలీజయిన అనంతరం అమెజాన్ ప్రైమ్ లోనే రానుంది. ఈ సినిమా తరపున విజయ్ అమెజాన్ ఈవెంట్లో పాల్గొన్నాడు.
