Mahesh Babu Foundation : గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల కోసం.. 300 మంది వ్యక్తులతో MB ఫౌండేషన్..
గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల కోసం MB ఫౌండేషన్ రీసెంట్ గా హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో..

Namrata at Mahesh Babu Foundation Heartathon event
Mahesh Babu Foundation : సూపర్ స్టార్ మహేష్ బాబు తన MB ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పిల్లలకు గుండె చప్పుడు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ చేసే ఈ మంచి పనిలో ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీ కూడా భాగం అవుతుంది. రీసెంట్ గా ఈ రెండు సంస్థలు కలిసి.. గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా ఒక కార్యక్రమం నిర్వహించాయి.
పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా మరియు ఈ సేవా నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకొని.. మార్చి 16న హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో సుమారు 300 మంది వ్యక్తులతో ‘హార్ట్‌థాన్’ పేరిట ఒక రన్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న 300 మంది వ్యక్తులు 3కి.మీ నుంచి 5కి.మీ మార్గంలో రన్ చేసి MB ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్ చేస్తున్న గొప్ప పనికి తోడుగా నిలిచారు.
Also read : Tollywood New Movies : టాలీవుడ్ కొత్త సినిమాల స్టోరీ లైన్స్ చెబుతూ.. అమెజాన్ ప్రైమ్ పోస్టులు వైరల్..
ఇక రన్ లో విజేతలుగా నిలిచిన వారికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. అవార్డులు ఇచ్చి సత్కరించారు. అలాగే ఈ మంచి కార్యక్రమంలో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక అవార్డులను అందించిన నమ్రత మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడం కోసం చేసిన ఈ హార్ట్‌థాన్ మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఔట్‌రీచ్ క్లబ్‌ల నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.
కాగా ఈ అవార్డు ఈవెంట్ లో విజేతలో ఫొటో దిగి నమ్రత వారిని సంతోష పరిచారు. ఈ ఫోటోలను MB ఫౌండేషన్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram