×
Ad

Shahrukh Khan : మీరు చదివిందంతా అబద్దం.. నేను అస్సలు రిటైర్ అవ్వను.. షారుఖ్ వ్యాఖ్యలు..

పఠాన్ సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినప్పుడు చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ పెద్ద విజయం సాధించినందుకు ట్విట్టర్లో #AskSRK అనేపేరుతో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఓ 15 నిమిషాలపాటు ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు................

  • Published On : February 21, 2023 / 07:36 AM IST

Shahrukh Khan chitchat with fans in twitter and he said wont retire at any cost

Shahrukh Khan :  చాలా సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమా పఠాన్ మొదటి రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోయి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 996 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 1000 కోట్లకు చాలా దగ్గరగా ఉంది.

పఠాన్ సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినప్పుడు చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజాగా షారుఖ్ ఖాన్ పఠాన్ పెద్ద విజయం సాధించినందుకు ట్విట్టర్లో #AskSRK అనేపేరుతో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు. ఓ 15 నిమిషాలపాటు ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుఖ్ తనశైలిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని బాలీవుడ్ లో మీరు రిటైర్ అయ్యాక మీ స్థానంలో ఎవరు ఉంటారు అని అడగగా.. షారుఖ్ నేను అస్సలు రిటైర్ అవ్వను, నన్ను ఎవరైనా తీసేయాల్సిందే, ఒకవేళ అలా తీసేసినా నేను మరింత హాట్ గా కంబ్యాక్ ఇస్తాను అని అన్నాడు. దీంతో షారుఖ్ రిటైర్ అవ్వడనే ట్వీట్ వైరల్ గా మారింది.

R Narayanamurthy : సార్ సక్సెస్ మీట్ లో.. యాంకర్ పై ఫైర్ అయిన ఆర్ నారాయణమూర్తి..

అలాగే ఓ అభిమాని మీకు పెట్స్ ఉన్నాయా? అవి ఇష్టమా? అని అడగడంతో.. నా దగ్గర చాలా పెట్స్ ఉన్నాయి, కానీ నేను వాటని సోషల్ మీడియాలో పెట్టను, అందరికి చూపించను అని చెప్పాడు షారుఖ్. ఒక అభిమాని తన చేతులపై టాటూలు వేయించుకున్న షారుఖ్ పేర్లని చూపించి వాటి గురించి చెప్పుమనగా.. నీ చేతులు నా చెక్ బుక్స్ అనుకుంట అంటూ సరదా కామెంట్ ఇచ్చాడు. ఓ అభిమాని మీ దగ్గర ఉన్న కార్ల లైనప్ గురించి చెప్పండి అని అడగగా నా దగ్గర అంత భారీ కార్లు లేవు, మీరు ఆర్టికల్స్ లో నా లగ్జరీ కార్లు అంటూ చదివిందంతా అబద్దం అని అన్నాడు. అలాగే ఓ అభిమాని పఠాన్ 2 గురించి అడగగా.. నాకే ఇంకా తెలీదు పఠాన్ 2 గురించి. ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేనే చెప్తాను, ఎలాంటి స్టుపిడ్ ఆర్థికల్స్ చదివి నమ్మకండి అంటూ రిప్లై ఇచ్చాడు షారుఖ్. ఇలా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుఖ్ సమాధానాలు ఇచ్చాడు.