Shahrukh Khan : షారుఖ్ పదేళ్ల క్రితం నయనతారకు ఇచ్చిన ప్రామిస్ ఇప్పుడు నిలబెట్టుకున్నాడు.. అట్లీ ఉన్నప్పుడే..

నయనతారకు ఇదే మొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం, నయన్ దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు.

Shahrukh Khan said ok to Nayanthara for give chance in his movies before 10 years and now Jawan happening

Shahrukh Khan Nayanthara : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చాడు. ఈ సినిమా అభారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాన్ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది.

అయితే నయనతారకు ఇదే మొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం, నయన్ దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. సినిమాల్లోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్ లో జవాన్ సినిమాతో అడుగుపెట్టింది. జవాన్ బాలీవుడ్ సినిమా అయినా ఇందులో హీరోయిన్, కొన్ని ముఖ్య పాత్రలు, విలన్, డైరెక్టర్ అంతా తమిళ్ వాళ్ళే.

Jawan Collections : జవాన్ మొదటి రోజు 120 కోట్లు దాటినా.. ఆదిపురుష్ ఫస్ట్ డే రికార్డ్ అందుకోలేకపోయింది..

అయితే నయనతారకు తన పక్కన ఛాన్స్ ఇస్తాను అని షారుఖ్ పదేళ్ల క్రితమే చెప్పాడు. ఓ అవార్డు ఈవెంట్ లో నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకుంది. ఆ ఈవెంట్ లో షారుఖ్ కూడా ఉన్నాడు. అయితే అప్పుడే అక్కడ ఉన్న హోస్ట్ నయనతారకు షారుఖ్ తో కలిసి నటించాలని ఉందట అనగా షారుఖ్ దానికి ఓకే అన్నట్టు సిగ్నేచర్ చూపించాడు. అదే ఈవెంట్లో అట్లీ కూడా ఉన్నాడు. దీంతో పదేళ్ల క్రితం షారుఖ్ నయనతార తనతో నటిస్తాను అంటే ఓకే చెప్పగా అది ఇపుడు అట్లీ దర్శకత్వంలో నెరవేరింది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ట్రెండింగ్ వార్తలు