Jawan Collections : జవాన్ మొదటి రోజు 120 కోట్లు దాటినా.. ఆదిపురుష్ ఫస్ట్ డే రికార్డ్ అందుకోలేకపోయింది..
జవాన్ సినిమా మొదటి రోజే ఏకంగా 129 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసినా మొదటి రోజు అత్యధికంగా కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమా రికార్డ్ మాత్రం చెరిపేయలేకపోయింది.
Jawan Collections : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్(Jawan) సినిమాతో వచ్చాడు. ఇందులో నయనతార(Nayanathara) హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పదుకొనే.. మరికొంతమంది స్టార్స్ ముఖ్య పాత్రలు చేశారు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కింది.
ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది జవాన్. మనకు సౌత్ వాళ్లకి పాత కథే అయినా నార్త్ వాళ్లకి చాలా కొత్తగా ఉండటంతో సినిమాని ఆకాశానికెత్తేస్తున్నారు. మనకి తెలిసిన కథలో షారుఖ్ ని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు అట్లీ. సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. షారుఖ్ జవాన్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిత్రయూనిట్ ఈ కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది.
Jawan Movie: జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ పట్టుకున్న ఫోనుపై ఎందుకింత రచ్చ రచ్చ?
అయితే జవాన్ సినిమా మొదటి రోజే ఏకంగా 129 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసినా మొదటి రోజు అత్యధికంగా కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమా రికార్డ్ మాత్రం చెరిపేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా ఆదిపురుష్ ఇంకా అలాగే ఉంది. ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అయినా కూడా మొదటి రోజు భారీ అంచనాలతో వెళ్లడంతో 140 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఆదిపురుష్ మొదటి రోజు రికార్డుని జవాన్ సినిమా బద్దలుకొట్టలేకపోయింది. ఇక జవాన్ సినిమా రెండు రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు సమాచారం.