Shakalaka Shankar : షకలక శంకర్ హీరోగా మరో సినిమా.. పోలీస్ ఆఫీసర్ గా మేరంగి జంక్షన్ అంటూ..
మేరంగి జంక్షన్ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. (Shakalaka Shankar)
- Saketh U
- Published on- August 11, 2026 / 08:42 PM IST
Shakalaka Shankar
Shakalaka Shankar : షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్, ప్రభాకర్, రాధా కోహినూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మేరంగి జంక్షన్’. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో రవికృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహనరావు, చొక్కపు రాములమ్మ, సీర గణపతి నాయుడు నిర్మాణంలో శివ గణేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
మేరంగి జంక్షన్ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. ఒక పాట, ఒక ఫైట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also See : Vishwanath and Sons : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..
తాజాగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడుతూ.. ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మేరంగి అనే ఊరిలో జరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథ ఇది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. షకలక శంకర్ ఏజెన్సీ ఏరియాలో పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారు. మొదటి సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో కొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా ఇస్తుంది. 2026 చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
