రణ్‌వీర్‌కు జోడీగా షాలినీ పాండే

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ సినిమాలో నటించనుంది..

  • Publish Date - December 11, 2019 / 10:45 AM IST

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ సినిమాలో నటించనుంది..

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. వరుస హిట్లతో జోరుమీదున్న స్టార్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా నటించే అవకాశం షాలినీకి దక్కింది. రణ్‌వీర్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ షాలినీని కూడా హిందీ తెరకు పరిచయం చేయనుండటం విశేషం.

ఈ విషయాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. దివ్యాంగ్‌ థక్కర్‌ దర్శకత్వంలో తాము నిర్మిస్తున్న ‘జయేష్‌భాయ్‌ జోర్దార్‌’ సినిమాలో షాలినీని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.

కాగా విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండే జంటగా తెరకెక్కిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో షాలినీ బోల్డ్ నటిగా పేరొందింది. సంచనాలతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా హిందీలో ‘కబీర్‌సింగ్‌’గా రీమేక్‌ అయ్యింది. షాలినీ త్వరలో షూటింగులో పాల్గొనబోతోంది.