Shalini Pandey Video : శాలిని పాండే తీవ్ర ఆగ్రహం.. ఆ వీడియోలో ఉంది నేను కాదు..
Shalini Pandey Video: తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై నటి శాలిని పాండే స్పందించారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 1, 2026 / 05:01 PM IST
shalini pandey video Deeply Disturbing Arjun Reddy Star Shalini Pandey Reacts To Her Fake AI Generated Video
Shalini Pandey AI Video: ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు సంబంధించిన డీప్‌ఫేక్, ఏఐ జనరేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, శృతిహాసన్, టబు, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి హీరోయిన్లు డీప్‌ఫేక్ బారిన పడ్డారు. తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే కూడా ఈ జాబితాలో చేరింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలపై ఆమె స్పందించారు. తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అని చెప్పుకొచ్చింది. అది ఏఐ టెక్నాలజీతో చేసిందని, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంది. టెక్నాలజీ ఉపయోగించి ఇలా మహిళలను కించపరిచేలా వాడటం అత్యంత దారుణం అని చెప్పింది. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన్నట్లు తెలిపింది. దయచేసి ఆ వీడియో కనిపిస్తే ఎవరూ షేర్ చేయొద్దు, డౌన్‌లోడ్ చేయొద్దు, వెంటనే రిపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నట్లుగా చెప్పింది.
Also Read – Kaaka : కాకా మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్!
శాలినీ పాండే 2017లో విజయ్ దేవరకొండతో కలిసి అర్జున్ రెడ్డి చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తరువాత మహానటి, 118, జయేష్ భాయ్ జోర్డార్, మహారాజ్ వంటి చిత్రాల్లో నటించింది.
