Indian 2 : అవినీతిని పూర్తిగా నిర్మూలించడం కోసం భారతీయుడు సిద్ధం..

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 అప్డేట్ వచ్చేసింది.

shankar Kamal Haasan Bharateeyudu Indian 2 movie update is here

Indian 2 : కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సోషల్ మెసేజ్ మూవీ ‘భారతీయుడు’. దశాబ్దాలు తరువాత ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తీసుకు వస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ ని రెండు భాగాలుగా సిద్ధం చేసారు. ఇండియన్ 2, ఇండియన్ 3 టైటిల్స్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టుప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

కాగా ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ శంకర్ అదిరిపోయే అప్డేట్ ని తీసుకు వచ్చేసారు. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ కచ్చితమైన డేట్ ని అనౌన్స్ చేయలేదు. మరి ఆ తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. తెలుగు, తమిళ్, హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.

Also read : Pushpa 2 : పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే.. సురేష్ రైనా ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెంట్ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు