Pushpa 2 : పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే.. సురేష్ రైనా ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

పుష్ప 2 గురించి ఇండియన్ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ వేశారు. పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమేలే..

Pushpa 2 : పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే.. సురేష్ రైనా ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

Suresh Raina instagram story on Allu Arjun Pushpa 2

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న సినిమా ‘పుష్ప 2’. మొదటి పార్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఆడియన్స్ లో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది. నార్మల్ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు పుష్ప 2 కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.

ఇలా ఎదురు చూస్తున్నవారిలో ఇండియన్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. స్టార్ క్రికెటర్ సురేష్ రైనా తాజాగా తన ఇన్‌స్టాలో పుష్ప గురించి పోస్టు వేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసి.. ప్రత్యేక పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే నిన్న అల్లు అర్జున్ త్రిసూలం పట్టుకొని ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Also read : Rishab Shetty : ఆ పాత్రతో నటుడిగా కెరీర్ స్టార్ట్.. దశాబ్దాల తరువాత ఆ పాత్రతోనే అంతర్జాతీయ గుర్తింపు.. కాంతార జర్నీ..

ఇక ఈ పోస్టర్ ని సురేష్ రైనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసారు. ఈ పోస్ట్ చూస్తుంటే.. రైనాకి ఈ సినిమా పై ఎంత ఆసక్తి ఉందో తెలుస్తుంది. ఇక ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ‘పుష్ప అంటే ఆ మాత్రం క్రేజ్ సాధారణమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రైనా షేర్ చేసిన స్టోరీ స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది.

Suresh Raina instagram story on Allu Arjun Pushpa 2

కాగా ఈ సెకండ్ పార్ట్ లో జాతర సీక్వెన్స్ హైలైట్ గా ఉండబోతుందట. ఈ సీక్వెన్స్ లో ఒక సాంగ్ అండ్ ఫైట్ ఉండబోతుందట. అల్లు అర్జున్ అమ్మోరు గెటప్ లో గూస్‌బంప్స్ తెప్పించే డాన్స్ అండ్ ఫైట్ చేసి ఆకట్టుకోబోతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసే టీజర్ ని కూడా ఆ జాతర సీక్వెన్స్ కి సంబంధించిన షాట్స్ తోనే రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. మరి టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలంటే.. ఇంకా రెండు రోజులు వెయిట్ చేయాలి.