shanmukh jaswanth emotional comments about his past love
Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో ఫుల్ ఫేమ్ అయ్యాడు. మనోడికి సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉండేది. ఈ నేపధ్యంలోనే మరో యూట్యూబర్ దీప్తి సునైనాతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. అయితే, ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వీరి బంధానికి బ్రేక్ వేసింది. బిగ్ బాస్ అనంతరం పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.
2021 బిగ్ బాస్ సీజన్ 5 తరువాత బ్రేకప్ చెప్పుకున్నారు షణ్ముఖ్ అండ్ దీప్తి సునైనా. ఆ తరువాత ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉండిపోయారు. కానీ, అందరికీ షాక్ ఇస్తూ షణ్ముఖ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. బ్రేకప్ తరువాత డిప్రెషన్ లోకి వెళ్లిన షణ్ముఖ్(Shanmukh Jaswanth) ఈ అమ్మాయి పరిచయం తరువాతనే కాస్త స్ట్రాంగ్ అయ్యాడట. అలా ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ ఇంటర్వ్యూలో తన పాస్ట్, ప్రెజెంట్ గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ బ్రేకప్ తరువాత నిజంగా బాధపడ్డావా అని అడిగాడు. దానికి సమాధానంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. అవును.. చాలా బాధపడ్డాను. కానీ, నేను ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాను. నావల్ల తనకు, ఎవరికీ బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకున్నాను. సిచువేషన్ ని అర్థం చేసుకొని ముందుకు నడిచాను.
కానీ, ఎందుకు బ్రేకప్ చెప్పావు. రా.. నాకు సమాధానం చెప్పు అనే ప్రెజర్ చేయలేదు. నిజం చెప్పాలంటే.. నేను నేను బెస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు షణ్ముఖ్. దీంతో, షణ్ముఖ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక షణ్ముఖ్ చేసిన కామెంట్స్ కి నెటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. నువ్ చాలా గ్రేట్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా ‘ప్రేమకు నమస్కారం’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.