Shanmukh Jaswanth : పెళ్లయిన మూడు రోజులకే హాస్పిటల్ లో చేరిన షణ్ముఖ్ జస్వంత్.. ఫోటో వైరల్..

ఇటీవల షణ్ముఖ్ జస్వంత్.. వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. (Shanmukh Jaswanth)

  • Published on- June 24, 2026 / 08:43 PM IST

Shanmukh Jaswanth

Shanmukh Jaswanth : షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ సాంగ్స్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్ జస్వంత్. ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని ఇప్పుడు సినిమాల్లో కూడా ఎంటర్ అవుతున్నాడు. తన వెబ్ సిరీస్ లతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నాడు షన్ను. ఇటీవల షణ్ముఖ్ జస్వంత్.. వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

జూన్ 21న తిరుమలలో కేవలం బంధుమిత్రులు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది. నిన్న వైజాగ్ లో తన సొంతింటి వద్ద సింపుల్ గా రిసెప్షన్ కూడా నిర్వహించినట్టు సమాచారం. అయితే షణ్ముఖ్ జస్వంత్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read : Balakrishna : అల్లుడు గెస్ట్ గా 200 కోట్ల బాలయ్య సినిమా ఓపెనింగ్.. అమరావతిలో NBK112..

షన్ను హాస్పిటల్ బెడ్ మీద ఉండి సెలైన్ బాటిల్ ఎక్కించుకున్న ఫోటోను తనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారి షన్నుకి ఏమైంది అని అభిమానులు కంగారు పడుతూ ఆరా తీస్తున్నారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో షేర్ చేసినా ఏం అయిందో చెప్పలేదు. అయితే పెళ్లి, రిసెప్షన్ ఈ హడావిడిలో అలిసిపోవడం లేదా డీ హైడ్రేట్ అవ్వడం, నీరసించడం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై షణ్ముఖ్ క్లారిటీ ఇస్తే కానీ అతనికి ఏమైందో తెలీదు.