Shantabai Song : ‘శాంతాబాయి’ మళ్ళీ వచ్చేసింది.. ఈసారి సన్నీలియోన్ వర్షన్..
మీరు కూడా సన్నీలియోన్ శాంతాబాయి సాంగ్ చూసేయండి.. (Shantabai Song)
- Saketh U
- Published on- September 4, 2026 / 03:21 PM IST
Shantabai Song
Shantabai Song : ఒకప్పుడు నార్త్ మొత్తాన్ని ఊపేసిన పాట శాంతాబాయి. డీజే అరేంజ్ చేస్తే నార్త్ లో శాంతాబాయి పాట ఉండాల్సిందే. తెలంగాణలో కూడా శాంతాబాయి గతంలో బాగానే పాపులర్ అయింది. ఓ పదేళ్ల క్రితం వచ్చిన ఈ మరాఠీ పాట అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా ఈ పాటను కాస్త రీమిక్స్ చేసి కొత్తగా వీడియో ఆల్బమ్ చేసారు.
అప్పుడు పాట రాసి పాడి కంపోజ్ చేసిన సంజయ్ లొంధే నే ఇప్పుడు కూడా కంపోజ్ చేసి పాడారు. అయితే ఈసారి శాంతాబాయి గా సన్నీలియోన్ నటించింది. మరాఠీ స్టైల్ లో బోల్డ్ డ్రెస్ వేసి ఓ బార్ లో సన్నీలియోన్ స్టెప్పులతో కంపోజ్ చేసిన ఈ వీడియో సాంగ్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఒకప్పటి పాపులర్ సాంగ్ శాంతాబాయికి సన్నీ లియోన్ స్టెప్పులు వేయడంతో ఈ పాట వైరల్ గా మారింది.
మీరు కూడా సన్నీలియోన్ శాంతాబాయి సాంగ్ చూసేయండి..
