Sharanya Shashi : క్యాన్సర్ తో పోరాటం.. ప్రముఖ నటి మృతి

కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. తరతమ బేధం, పేద ధనిక అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారినపడి ఇబ్బంది పడ్డారు. కరోనా సోకి ఎంతోమంది ప్రముఖులు మృతి చెందారు. తాజాగా ఓ సినీ నటి కరోనామహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు.

Sharanya Shashi : కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు విడిచారు. తరతమ బేధం, పేద ధనిక అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారినపడి ఇబ్బంది పడ్డారు. కరోనా సోకి ఎంతోమంది ప్రముఖులు మృతి చెందారు. తాజాగా ఓ సినీ నటి కరోనామహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు.

మలయాళ నటి శరణ్య శశి (35) కరోనాతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు శరణ్య.. ఈ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆరోగ్యపరిస్థితి విషమించి మృతి చెందారు. శరణ్య శశి(35) ఆగస్ట్ 9న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లారు.

క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.. ఒకటీ రెండు కాదు, ఏకంగా 10ఏళ్లపాటు మహమ్మారితో తలపడింది. అలాంటి ఆమెను కరోనా సైతం వదల్లేదు. కరోనా నుండి కోలుకుంటుంది అనుకునే లోపు ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడాయి. న్యుమోనియాతో పాటు రక్తంలో స్టోడియం స్థాయిలు పడిపోవడంతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో క‌న్నుమూసింది.

ట్రెండింగ్ వార్తలు