Sharwanand Birthday Gift for Amala Akkineni
Sharwanand: గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వానంద్ కు “ఒకే ఒక జీవితం” సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అనే చెప్పాలి. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి అమ్మ సెంటిమెంట్ ని జతచేసి చాలా అందంగా చూపించాడు దర్శకుడు. ఇంతటి విజయాన్ని అందించినందుకు హీరో శర్వానంద్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.
Oke Oka Jeevitham: తన సినిమా టికెట్లు తనకే దొరకలేదని అంటోన్న ‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్!
ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల అక్కినేని కనిపించారు. ఇక శర్వానంద్, అమల మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల కళ్ళ నుంచి కన్నీళ్లను రప్పించాయి. మూవీలోని “అమ్మ” ఫుల్ వీడియో సాంగ్ ని సోమవారం అమల పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఈ పాటలోని సాహిత్యం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.
జేక్స్ బెజాయ్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. శ్రీకార్తిక్ తెరకెక్కించిన ఈ సినిమాలో వెన్నల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించగా రీతూ వర్మ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.