Vishwambhara : ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ చెప్పేసిన మెగాస్టార్.. హమ్మయ్య ఎట్టకేలకు వచ్చేస్తుంది..
తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ తెలిపారు. (Vishwambhara)
Vishwambhara
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి హిట్ కొట్టారు. అయితే దీనికంటే ముందు రావాల్సిన విశ్వంభర సినిమా మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సోషియో ఫాంటసీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి.. పలువురు హీరోయిన్స్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.(Vishwambhara)
ఇప్పటికే విశ్వంభర టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేయగా దీనిపై గ్రాఫిక్స్ బాగోలేవంటూ ట్రోల్స్ వచ్చాయి. దీంతో సినిమాని రీ షూట్ చేయడం, CG వర్క్ మరింత బెటర్ చేయడం కోసం వాయిదాలు వేస్తున్నారు. గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఎప్పుడొస్తుందో క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ తెలిపారు.
Also Read : Chiranjeevi : పవన్ కళ్యాణ్ కే ఆ సమర్థత ఉంది.. రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. చిరంజీవి కామెంట్స్ వైరల్..
మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత చిరంజీవి పలువురు సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడగా తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. విశ్వంభర సినిమా జులై 9న వచ్చే అవకాశం ఉంది. CGలు ఇంకా నేను చూడలేదు. బాబీతో చేయబోయే సినిమా మాస్ ఎంటర్ టైనర్ గా, అతని స్టైల్ లో ఉంటుంది అని తెలిపారు. దీంతో ఎట్టకేలకు విశ్వంభర సినిమా జులై 9 న రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.
