Anjali : భర్త కంటే ఎక్కువ ఫేమ్ వచ్చేసిందని యాక్టింగ్ మానేసిన హీరో భార్య.. ఒకప్పటి ఈ హీరోని గుర్తుపట్టారా?
తన భర్త కంటే ఎక్కువ గుర్తింపు తనకు వద్దు అని అంజలి యాక్టింగ్ మానేసినట్టు ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. (Anjali)
Anjali
Anjali : ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది నటి అంజలి. ఇప్పుడు కూడా సీరియల్స్, టీవీ షోలు, యూట్యూబ్ తో బిజీగానే ఉంది. కానీ అంజలి మధ్యలో కొన్నాళ్ళు యాక్టింగ్ మానేసింది. తాజాగా అంజలి పవన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది.(Anjali)
అంజలి ఐ లవ్ యు, సోగ్గాడి సరదాలు, 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జూనియర్స్.. అప్పట్లో ఇలా అనేక సినిమాల్లో హీరోగా, మెయిన్ పాత్రల్లో నటించిన సంతోష్ పవన్ ని అంజలి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్లో సంతోష్ కి మంచి ఫేమ్ ఉండేది. కానీ కొంత కాలానికి సంతోష్ పవన్ కి అవకాశాలు తగ్గిపోవడంతో అతన్ని పట్టించుకోవడం మానేశారు జనాలు. దీంతో తన భర్త కంటే ఎక్కువ గుర్తింపు తనకు వద్దు అని అంజలి యాక్టింగ్ మానేసినట్టు ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.
Also Read : Sravanthi Chokarapu : పసుపు చీరలో యాంకర్ స్రవంతి పరువాలు.. ఫొటోలు వైరల్..
అంజలి పవన్ మాట్లాడుతూ.. నా కంటే ఎక్కువ పేరు నా భర్తకు రావాలి. పెళ్ళికి ముందే అనుకున్నాను ఇది. నా కంటే ముందే ఆయన హీరో, ఆయనకు మంచి ఫేమ్ ఉంది. కానీ నేను సీరియల్స్, టీవీ షోలు చేస్తున్న సమయంలో నా భర్త సినిమా ఛాన్సుల కోసం కష్టపడుతున్నాడు. పెళ్లి తర్వాత ఒక రోజు గుడికి వెళ్తే అక్కడ అందరూ నా భర్తకే ఫోన్ ఇచ్చి నాతో ఫోటోలు దిగారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు నా భర్త మంచి హీరో. నా కంటే ఎక్కువ ఫేమ్ ఉండేది కానీ ఇప్పుడు ఛాన్సులు లేకపోవడంతో ఎవరూ గుర్తుపట్టట్లేదు.
దాంతో నేను ఫిక్స్ అయి సీరియల్స్ ఇంక చేయను, ఫ్యామిలీని చూసుకుంటాను నువ్వుసినిమాల్లో ట్రై చేయి కావాలంటే నేను ఏదైనా బిజినెస్ చేస్తాను అని చెప్పాను. దాంతో వచ్చిన ఛాన్సులు అన్ని రిజెక్ట్ చేశాను. యాక్టింగ్ మానేసాను ఆయన కోసం. కొన్నాళ్ళకు నేను ఎక్కడా కనపడట్లేదని అందరూ అడుగుతున్నారు. మా ఆయన కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒప్పించడంతో మళ్ళీ సీరియల్స్ మొదలుపెట్టాను. సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆర్టిస్ట్ గా మళ్ళీ గుర్తిపు వచ్చింది ఆయనకు. కానీ అతను ఒకప్పటి నటుడు అని గుర్తు పట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి టీవీ షోలు కూడా చేసాము అని తెలిపింది.
Also Reda : Prabhas : ‘ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర..’ అప్పటి ఆర్టికల్ ఇప్పుడు వైరల్..
దీంతో అంజలిని అభినందిస్తున్నారు ఆమె అభిమానులు, నెటిజన్లు. భర్తకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఇలా భర్త గురించి ఆలోచించి యాక్టింగ్ మానేద్దామనే డేరింగ్ డెసిషన్ తీసుకోవడాన్ని అభినందిస్తున్నారు. సంతోష్ పవన్ – అంజలి జంట ఇప్పుడు ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు.

