Prabhas : ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర.. అప్పటి ఆర్టికల్ ఇప్పుడు వైరల్..
ఛత్రపతి రిలీజ్ తర్వాత ఓ మ్యాగజైన్ లో ప్రభాస్ గురించి వచ్చిన ఓ ఆర్టికల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. (Prabhas)
Prabhas
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఇటీవల ప్రభాస్ పై కుట్ర జరుగుతుందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రభాస్ బాహుబలితో ఎదగడంతో బాలీవుడ్ వాళ్ళు కుళ్ళుకుంటున్నారని, సలార్ సమయంలో థియేటర్స్ ఇవ్వలేదని, ప్రభాస్ సినిమాలకు తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారని, బాలీవుడ్ లో కొంతమంది హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ పై నెగిటివ్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.(Prabhas)
ఇటీవల రాజాసాబ్ సమయంలో కూడా ఇదే జరిగిందని ప్రభాస్ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇక్కడ టాలీవుడ్ లో కూడా కొంతమంది హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ పై, ఆయన సినిమాలపై నెగిటివిటి చేస్తున్నారని అంటున్నారు. తాజాగా ఛత్రపతి సమయంలోని ఓ ఆర్టికల్ వైరల్ గా మారింది. ఛత్రపతి రిలీజ్ తర్వాత ఓ మ్యాగజైన్ లో ప్రభాస్ గురించి వచ్చిన ఓ ఆర్టికల్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
Also Read : Rajinikanth : సూపర్ స్టార్ బయోపిక్.. ఆ అదృష్టం వరించేది ఎవర్నో..
Prabhas
ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర? అనే టైటిల్ తో ఆ ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ లో.. కృష్ణంరాజు అన్న కుమారుడు, కృష్ణంరాజు నట వారసుడు ప్రభాస్ కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా? అతడు ఎవరితోనూ గొడవ పడే వ్యక్తికాదు. మరి అతడి ఎదుగుదలకి కుట్ర పన్నుతున్నదెవరు? గతంలో కృష్ణంరాజుపై అలాంటి కుట్రలు ఏమీ లేవు. కృష్ణంరాజు విలన్ గా ఎంటరయి, హీరోగా మారి గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ తో నిర్మాతగా కూడా మారాడు. అయితే అప్పటి పరిస్థితులు వేరని ఇప్పుడున్న యంగ్ హీరోలలో పర్సనాలిటీ, అందంలో ప్రభాస్ కి ఎవరూ సాటిరారని నటనలో కాస్త నలిగాడంటే చాలామంది యువ వారసులు మూల కూర్చోవలసిందేనని యంగ్‌స్టర్స్ అందరి అభిమానాన్ని అతడే కొల్లగొట్టేస్తాడని కొందరు యువ హీరోల పెద్దలకు గుబులుగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు విని పిస్తున్నాయి.
ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న మోనోపలి దెబ్బ తింటుందని అందుకే అతడి ఎదుగుదల స్పీడప్ అవకుండా చూడాలని కొంతమంది సినీ ప్రముఖులు ఒక గెస్ట్ హౌస్‌లో జరిగిన మందు పార్టీల్లో అన్నట్టు చెప్పుకొంటున్నారు. ఈ కామెంట్స్ నిజమేనని తమ దగ్గరికీ వచ్చాయని, అయితే వాళ్ళకు అంత సీన్ లేదని ప్రభాస్ అనుయాయులు తేలిగ్గా కొట్టిపారేస్తు న్నారు. ఇంకెక్కడి మోనోపలి? దానికి ఏనాడో కాలం చెల్లింది. సత్తా ఉన్నోడు 70 లక్షలు తెచ్చు కున్నా ఆనంద్ లాంటి సినిమా తీసి మగాడు అని నిరూపించుకోవచ్చు. ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు దూసుకురావచ్చు. ఇప్పుడు ఎవడి టాలెంట్‌నీ ఎవడూ ఆపలేడు. ఇప్పటికే కోస్తాలో చిరంజీవి తర్వాత అంతటి ఇమేజ్ ని ప్రభాస్ సంపాదించుకుంటున్నాడు అని ప్రభాస్ సామాజిక వర్గానికే చెందిన ఒక సినీ ప్రముఖుడు వ్యాఖ్యానించాడు అని రాసుకొచ్చారు.
Also Read : Ashu Reddy : బాబోయ్.. చాన్నాళ్లకు పద్దతిగా చీరకట్టులో అషురెడ్డి.. ఫోటోలు..
తార సితార అని అప్పట్లో స్పైసీ ఆర్టికల్స్ రాసే మ్యాగజిన్ ఉండేది. అందులో ఛత్రపతి రిలీజ్ అయిన రెండు నెలలకు వచ్చిన ఆర్టికల్ ….#Prabhas pic.twitter.com/Cof2szMFFp
— Skydream Media (@SkydreamMedia) January 28, 2026
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఆర్టికల్ వైరల్ చేస్తున్నారు. అప్పట్లో ప్రభాస్ ఎదుగుదలపై టాలీవుడ్ వాళ్ళే కుట్ర చేశారు, ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
