Rajinikanth : సూపర్ స్టార్ బయోపిక్.. ఆ అదృష్టం వరించేది ఎవర్నో..
తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ బయోపిక్ గురించి మాట్లాడింది. (Rajinikanth)
Rajinikanth
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగు, తమిళ్ ప్రాంతాలతో పాటు మన దేశంలోనే కాక జపాన్, మలేషియా, సింగపూర్, అమెరికా.. లాంటి ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కండక్టర్ గా పనిచేస్తూ సినిమాల్లోకి వచ్చి విలన్ గా, సహాయ నటుడిగా సినిమాలు చేస్తూ హీరోగా మారి తనకంటూ ఒక సరికొత్త స్టైల్ తో మెప్పించాడు. తన స్టైల్ తో ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు రజినీకాంత్.(Rajinikanth)
తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ.. భాషల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో కూడా అభిమానుల కోసం ఇంకా సినిమాలు చేస్తున్నారు. అయన జీవితం ఎంతోమందికి ప్రేరణ. అలాంటి ఆయన జీవితాన్ని బయోపిక్ తీస్తారని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ బయోపిక్ గురించి మాట్లాడింది.
Also Read : Ashu Reddy : బాబోయ్.. చాన్నాళ్లకు పద్దతిగా చీరకట్టులో అషురెడ్డి.. ఫోటోలు..
ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. నాన్న బయోపిక్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఆ సినిమా విడుదల అయ్యాక ప్రపంచమంతా ఒక సెన్సేషన్ లా నిలుస్తుంది అని తెలిపింది. దీంతో రజినీకాంత్ బయోపిక్ రాబోతుందని క్లారిటీ వచ్చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రజినీకాంత్ బయోపిక్ లో రజిని పాత్రలో నటించే ఆ అదృష్టం ఏ హీరోకి వరించనుందో చూడాలి.
గతంలో ధనుష్ రజినీకాంత్ పాత్రలో నటిస్తా అన్నాడు, అతను సూట్ అవుతాడు కూడా. కానీ ఐశ్వర్యతో విడాకుల తర్వాత ధనుష్ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. మరి ధనుష్ రజినీకాంత్ పాత్రలో నటిస్తాడా లేదా ఇంకెవరైనా చేస్తారా చూడాలి. మరి తన బయోపిక్ లో రజినీకాంత్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇస్తారా తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. అలాగే ఈ బయోపిక్ కి రజిని కూతురు ఐశ్వర్యే డైరెక్షన్ చేస్తుందా వేరే ఎవరైనా చేస్తారా చూడాలి.
Also Read : Sharwanand : శర్వానంద్ సినిమాల్లో కంటే ముందే మెగాస్టార్ తో యాక్ట్ చేసాడని తెలుసా? చిరు ఇంటికి వెళ్తే..
