Thalaivar 170 : రజినీకాంత్, అమితాబ్ సినిమాలో శర్వానంద్.. సూపర్ ఛాన్స్ కొట్టేశాడుగా..

జినీకాంత్ 170వ సినిమాని జై భీమ్ (Jai Bhim) దర్శకుడు టిజె జ్ఞానవేల్ తో చేస్తున్న సంగతి గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

Sharwanand plays a key role along with Amitabh Bachchan in Rajinikanth Thalaivar 170 Movie

Thalaivar 170 : సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇటీవల జైలర్ (Jailer) సినిమాతో వచ్చి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోనే ఈ సినిమా దాదాపు 525 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇంకా థియేటర్స్ లో దూసుకుపోతుంది. జైలర్ తర్వాత లాల్ సలాం అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఆ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసేసారు రజిని.

ఇక రజినీకాంత్ 170వ సినిమాని జై భీమ్ (Jai Bhim) దర్శకుడు టిజె జ్ఞానవేల్ తో చేస్తున్న సంగతి గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. త్వరలోనే రజిని 170వ సినిమా మొదలుపెట్టనున్నారు.

తమిళ మీడియా సమాచారం ప్రకారం రజినీకాంత్ 170వ సినిమా పూజా కార్యక్రమాలు రేపు జరుగుతాయని సమాచారం. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ ని తీసుకున్నారు. రజిని, అమితాబ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ తో పాటు మన తెలుగు హీరో శర్వానంద్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నటు సమాచారం. ఈ పాత్ర కోసం ముందు నాని ని అడిగినట్టు వార్తలు వచ్చాయి. మరి ఏమైందో కానీ చివరికి శర్వానంద్ ఫైనల్ అయ్యాడు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తాడని, అలాగే అనిరుద్ కూడా సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని టాక్ నడుస్తుంది.

Gadar 2 : కొత్త పార్లమెంట్‌లో ప్రదర్శించబోయే మొదటి సినిమా ఇదే.. థియేటర్స్ లో రికార్డ్స్.. ఇప్పుడు మరింత గౌరవం..

జై భీమ్ లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీసిన టిజె జ్ఞానవేల్ ఇంతమంది స్టార్ కాస్ట్ ని పెట్టి రజిని 170వ సినిమాని ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. జైలర్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి వారంలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు