Adavallu Meeku Joharlu: థర్డ్ సింగిల్.. సూపర్బ్ బ్యూటిఫుల్ మెలోడీ!
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని..
- Naresh Mannam
- Published On : February 19, 2022 / 07:43 PM IST
Adavallu Meeku Joharlu
Adavallu Meeku Joharlu: శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వరుణ్ తేజ్ గని సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. గనితో పాటు ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు.
Adavallu Meeku Joharlu: శర్వా – రష్మిక ఫ్యాన్స్‌కు వాలంటైన్స్ డే ట్రీట్.. ఓ మై ఆద్యా..!
కానీ.. చెప్పిన రోజే వచ్చేస్తామని ఆడవాళ్లు మాకు జోహార్లు నిర్మాతలు మళ్ళీ ప్రకటించడమే కాకుండా రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన యూనిట్ వరసగా సాంగ్స్, టీజర్లు రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్ తో పాటు వాలంటైన్ డే సందర్భంగా ఓ.. మై ఆద్యా.. అంటూ మరో పాటని కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు శుక్రవారం ఫిబ్రవరి 18న థర్డ్ సింగిల్ కూడా విడుదల చేశారు.
Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!
ఎన్ని ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా.. ఇంకా కొన్ని మిగిలిపోవడం.. ఎంత ఎంత ఎంత దూరమున్నా.. నువ్వు పక్కన ఉన్న ఫీలింగ్ కలగడం అంటూ సాగే ఈ ఫీల్ గుడ్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేలా కనిపిస్తుంది. అప్పుడెప్పడో లవ్ ఫీల్ లో స్పెషల్ ట్రీట్ సాంగ్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ చాలాకాలం తర్వాత మాంచి లవ్ ఫీల్ సాంగ్ తో అదరగొట్టాడు. శర్వా, రష్మిక అందంగా ఉండడమే కాకుండా సాంగ్ పిక్చరైజేషన్ కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.
