తనకు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్తలపై స్పందించిన నటి షెఫాలి షా..
ఓ పక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే మరో పక్క గాసిప్ రాయుళ్లు రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఓ బాలీవుడ్ నటికి, ఆమె కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చింది అంటూ ఓ వార్తను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడంతో సదరు నటి స్పందించారు.
తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దాని ద్వారా తనకు కరోనా సోకిందంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేశారంటూ నటి షెఫాలి షా తెలిపారు. షెఫాలి ప్రముఖ దర్శక నిర్మాత విపుల్ షా భార్య. అయితే తన ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటూ ఎంతో మంది మెసేజ్‌లు, కాల్స్ చేశారని వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Also : పుష్పరాజ్ ఆరో వేలు సీక్రెట్ ఏందబ్బా!
కరోనా వచ్చిందంటూ వస్తోన్న వార్తలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారామె.‘‘నిన్న రాత్రి నా ఎఫ్‌బి అకౌంట్ హ్యాక్ అయింది. అయితే దీంతో ఓ రకంగా మంచే జరిగింది. ఎంతోమంది నాకు కాల్స్, మెసేజ్‌లు చేసి నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తెలిసిన వాళ్ల ద్వారా ఆరా తీశారు. కొందరు మీకు మాట్లాడాలనిపిస్తే దయచేసి ఫోన్ చేయండి అంటూ వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేశారు. వారిలో కొంతమందిని అయితే నేను బహుశా ఒకటి,రెండు సార్లు కలిసుంటా. వారు కూడా నా హెల్త్ విషయంలో ఎంతో ఆందోళన చెందారు. మీ అందరి ప్రేమకు పేరుపేరునా కృతజ్ఞతలు’’ అంటూ తనపై వస్తోన్న ఫేక్ న్యూస్‌పై షెఫాలి క్లారిటీ ఇచ్చారు. ‘మాన్‌సూన్ వెడ్డింగ్’, ‘వక్త్’, ‘దిల్ ధడక్నే దో’, ‘ఒన్స్ ఎగైన్’, ‘ఢిల్లీ క్రైమ్’ వంటి పలు చిత్రాలతో షెఫాలి షా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.