Shehnaaj Gill : ప్రేమ విషయంలో నన్ను చాలాసార్లు మోసం చేశారు.. ఎమోషనల్ అయిన నటి..
షెహనాజ్ సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్.. ఇలా తనకి వచ్చిన ఆఫర్స్ ని చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా బాలీవుడ్ లో షెహనాజ్ గిల్ నటించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజయింది. దీని ప్రమోషన్స్ లో షెహనాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
- Saketh U
- Published On : July 5, 2023 / 07:52 AM IST
Shehnaaj Gill comments on Love relations and get emotional
Shehnaaj Gill : పంజాబ్ భామ షెహనాజ్ గిల్ పంజాబీలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. బాలీవుడ్ బిగ్‌బాస్ లో పాల్గొని బాగా వైరల్ అయింది షెహనాజ్ గిల్. ఇక ఈ అమ్మడి ప్రేమ వ్యవహారాలు కూడా చాలా సార్లు వైరల్ అయ్యాయి. పలువురితో డేటింగ్ చేసినట్టు, ప్రేమలో ఉన్నట్టు అనేకసార్లు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ లో పరిచయమైన సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో ఉంది కానీ అతను అకస్మాత్తుగా గుంటుపోటుతో మరణించడంతో కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది షెహనాజ్.
ఇటీవలే మెల్లి మెల్లిగా కోలుకుంటూ షెహనాజ్ సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్.. ఇలా తనకి వచ్చిన ఆఫర్స్ ని చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా బాలీవుడ్ లో షెహనాజ్ గిల్ నటించిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజయింది. దీని ప్రమోషన్స్ లో షెహనాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
షెహనాజ్ గిల్ మాట్లాడుతూ.. నేను ఎవర్ని ప్రేమ విషయంలో మోసం చేయలేదు. కానీ నన్నే చాలా సార్లు కొంతమంది మోసం చేశారు. నేను చెప్పేది ఒక్కటే. ఎవరికైనా బ్రేకప్ చెప్పి వెళ్లాలనుకుంటే చెప్పేసి వాళ్ళ జీవితంలోనుంచి వెళ్లిపోండి. అంతే కానీ వారిని బాధపెట్టకండి అని ఎమోషనల్ అయింది. అయితే ఇదే ఇంటర్వ్యూలో నేను మోసపోయినా ప్రేమను వ్యతిరేకించాను అని, నిజమైన ప్రేమ, జీవితాంతం ఉండే ప్రేమ దొరికితే విడిచిపెట్టను అని చెప్పింది. దీంతో షెహనాజ్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మళ్ళీ ఎవరితో ప్రేమలో పడింది, షెహనాజ్ ని ఎవరు మోసం చేశారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
