Shilpa Shetty : భర్త వ్యవహారంతో శిల్పా శెట్టికి సెగ?

భర్త వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా, హిందీలో తను జడ్జిగా ఉన్న పాపులర్ రియాలిటీ షో నుండి తప్పుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి..

Shilpa Shetty: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది. హిందీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చెయ్యడంతో పాటు రూ. 7.5 కోట్లను సీజ్ చేశారు. రాజ్ కుంద్రాకు రిమాండ్‌కు తరలించారు.

Puneet Kaur : రాజ్ కుంద్రాపై పునీత్ కౌర్ ఆరోపణలు..

రాజ్ కుంద్రా ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు హీరోయిన్లు మీడియా ద్వారా అతగాడు చేసిన ఘనకార్యాలను చెప్పుకొస్తున్నారు. భర్త నిర్వాకంతో శిల్పా శెట్టికి సెగ తగిలింది. సుశాంత్ సింగ్ మరణం నేపథ్యంలో తెరమీదకొచ్చిన నెపోటిజనం వ్యవహారంలో నెటిజన్లు స్టార్ కిడ్స్‌ను సోషల్ మీడియాలో ఏకి పడేశారు. తన భర్త ఏకంగా పోర్న్ వీడియోలు నిర్మిస్తూ దాని ద్వారా పెద్ద రాకెట్‌నే నడుపుతున్నట్లు నిరూపితమవడంతో అతని వ్యవహారం శిల్పా కెరీర్‌పై కచ్చితంగా ప్రభాంత చూపిస్తోందనని బాలీవుడ్ బాబులు చర్చించుకుంటున్నారు.

Raj Kundra : ఆ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు ఎంత సంపాదించేవాడంటే..

ఇదిలా ఉండగా భర్త వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా, హిందీలో తను జడ్జిగా ఉన్న పాపులర్ రియాలిటీ షో నుండి తప్పుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లు సోనీ టీవీ రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రోమోలో శిల్పా శెట్టి ప్లేస్‌లో కరిష్మా కపూర్ కనిపించింది.

అయితే కరిష్మా ఒక ఎపిసోడ్‌కి గెస్ట్‌గా మాత్రమే వచ్చిందని సమాచారం. తర్వాత శిల్పా శెట్టి జడ్జిగా కంటిన్యూ అవుతుందా లేక ఆమె స్థానంలో మరొకరు వస్తారా అనేది చూడాలి.

ఇటీవల రాజ్ కుంద్రాతో సహా అతని కుటుంబ సభ్యులంతా కోవిడ్ బారిన పడడంతో శిల్పా బ్రేక్ తీసుకోగా ఆమె బదులు మలైకా అరోరా జడ్జి కుర్చీలో కూర్చుంది. ఇదిలా ఉంటే కొంత గ్యాప్ తర్వాత ‘హంగామా 2’ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది శిల్పా. ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శిల్పా శెట్టి నటించడం పట్ల బాలీవుడ్ హీరోయిన్ల నుండి కచ్చితంగా వ్యతిరేక వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు