Puneet Kaur : రాజ్ కుంద్రాపై పునీత్ కౌర్ ఆరోపణలు..

మోడల్స్‌ను పోర్న్ వీడియోలు చెయ్యాలని ఒత్తిడి చెయ్యడం, మాట వినకపోతే బెదిరింపులకు పాల్పడడం రాజ్ కుంద్రాకు అలవాటు అంటూ ఆమె ఆరోపణలు చేసింది..

Puneet Kaur : రాజ్ కుంద్రాపై పునీత్ కౌర్ ఆరోపణలు..

Puneet Kaur

Updated On : July 21, 2021 / 4:29 PM IST

Puneet Kaur: పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అవడం బాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. హిందీ పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్‌‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని పోర్న్ వీడియోల్లో నటించమని ఒత్తిడి చేస్తున్నట్లు నిరూపితమవడంతో రాజ్ కుంద్రాతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చెయ్యడంతో పాటు రూ. 7.5 కోట్లను సీజ్ చేశారు. రాజ్ కుంద్రాకు జూలై 23 వరకు రిమాండ్ విధించారు ముంబై పోలీసులు.

Kangana Ranaut: మెరిసేదంతా బంగారం కాదు.. రాజ్ కుంద్రా అరెస్టుపై కంగనా!

ఇప్పటికే అతనితో కలిసి పనిచేసిన పూనమ్ పాండే, షెర్లీన్ చోప్రా, గెహనా వశిష్ట్ వంటి హీరోయిన్ల స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. దీంతో రాజ్ కుంద్రాతో సంబంధాలున్న వారు ఎప్పుడు పోలీసుల నుండి పిలుపు వస్తుందోనని కంగారు పడుతున్నారు. మరికొందరు సెలబ్రిటీలు రాజ్ కుంద్రా మీద సోషల్ మీడియా ద్వారా ఫైర్ అవుతున్నారు. రీసెంట్‌గా యూట్యూబ్ స్టార్ పునీత్ కౌర్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

Raj Kundra : రాజ్ కుంద్రాతో ఈ హీరోయిన్లకు లింకులు..!

హాట్ వీడియోల కోసం రాజ్ కుంద్రా తనను కాంటాక్ట్ చేశాడని, తను రెస్పాండ్ అవకపోవడంతో కొద్దిరోజుల తర్వాత తన హాట్ వీడియోలనే తనకు పంపడంతో షాక్ అయ్యాయని, ఇదేంటని అడిగితే తన అకౌంట్ హ్యాక్ అయిందని వేరే వాళ్లు చెప్పారని, ఆ సందర్భంగా తనతో, మరో ఇద్దరు వ్యక్తులతో జరిగిన సంభాషణ గురించి పోస్ట్ చేసింది పునీత్ కౌర్. ఎప్పుడూ మోడల్స్‌ను పోర్న్ వీడియోలు చెయ్యాలని ఒత్తిడి చెయ్యడం, మాట వినకపోతే బెదిరింపులకు పాల్పడడం రాజ్ కుంద్రాకు అలవాటు అంటూ ఆమె ఆరోపణలు చేసింది.