Raj Kundra : రాజ్ కుంద్రాతో ఈ హీరోయిన్లకు లింకులు..!

రాజ్ కుంద్రా విచారణలో ఎవరి పేర్లు చెప్తాడో అని తనతో సన్నిహితంగా మెలిగిన బాలీవుడ్ స్టార్స్ భయంతో వణికిపోతున్నారట..

Raj Kundra : రాజ్ కుంద్రాతో ఈ హీరోయిన్లకు లింకులు..!

Raj Kundra

Raj Kundra: అశ్లీల చిత్రాల నిర్మాణంలో సంబంధాలున్నట్లు నిర్ధారణ కావడంతో నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చెయ్యడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీంతో బాలీవుడ్‌లో రాజ్ కుంద్రాతో ఎవరెవరకి సంబంధాలున్నాయనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.

ఇప్పటికే హీరోయిన్లు పూనమ్ పాండే, షెర్లీన్ చోప్రా, గెహనా వశిష్ట్.. వీళ్ల ముగ్గురి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారని, ముగ్గురూ కూడా రాజ్ కుంద్రాతో పనిచేసినట్లు అంగీకరించారంటూ బాలీవుడ్ మీడియా అండ్ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Sagarika Shona Suman : నగ్నంగా ఆడిషన్ అడిగాడు.. శిల్పా శెట్టి భర్తపై నటి షాకింగ్ కామెంట్స్..

పూనమ్ పాండే, షెర్లీన్ చోప్రా, గెహనా వశిష్ట్.. ఈ ముగ్గురూ హాట్ స్టార్స్‌గా ఇమేజ్ తెచ్చుకున్నారు. రాజ్ కుంద్రాతో కొన్ని ప్రైవేట్ వీడియోస్ చెయ్యడానికి అగ్రిమెంట్ చేసుకున్నామని, కొంతకాలంగా అతనితో కాంటాక్ట్‌లో లేమని వీళ్లు పోలీసులకు చెప్పారట. పూనమ్ కొద్ది రోజులు కుంద్రాతో కలిసి పనిచేసింది. ఫైనాన్షియల్ విషయంలో విబేధాలు రావడంతో రాజ్ కుంద్రా కంపెనీ నుండి బయటకొచ్చేసింది.

దీంతో అతను, టీమ్ కలిసి పలు పోర్న్ సైట్స్‌లో తన ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చెయ్యడంతో పాటు పాటు తన పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా షేర్ చేశారంటూ పూనమ్ గతంలో రాజ్ కుంద్రాపై కంప్లైట్ చేసింది. రాజ్ కుంద్రా విచారణలో ఎవరి పేర్లు చెప్తాడో అని తనతో సన్నిహితంగా మెలిగిన బాలీవుడ్ స్టార్స్ భయంతో వణికిపోతున్నారట.