Sagarika Shona Suman : నగ్నంగా ఆడిషన్ అడిగాడు.. శిల్పా శెట్టి భర్తపై నటి షాకింగ్ కామెంట్స్..

నటి, మోడల్ సాగరిక సోనా సుమన్, రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది..

Sagarika Shona Suman : నగ్నంగా ఆడిషన్ అడిగాడు.. శిల్పా శెట్టి భర్తపై నటి షాకింగ్ కామెంట్స్..

Sagarika Shona Suman

Updated On : July 20, 2021 / 2:35 PM IST

Sagarika Shona Suman: మీటు, డ్రగ్స్, ఇప్పుడు పోర్నోగ్రఫీ.. బాలీవుడ్‌లో మరోసారి అలజడి మొదలైంది. నటి శిల్పా శెట్టి భర్త, ఎంట్రప్రెన్యూర్ రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేయడంతో హిందీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. రాజ్‌ కుంద్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 292, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 67, 67 ఎ, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) రూల్స్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. అశ్లీల చిత్రాల నిర్మాణానికి సంబంధించి పోలీసులు గతేడాది కొంతమందిని అరెస్ట్ చేశారు. కాగా వారిచ్చిన సమాచారంతో రాజ్‌ కుంద్రాకు అశ్లీల చిత్రాల నిర్మాణంలో సంబంధాలున్నట్లు తేలటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

రీసెంట్‌గా నటి, మోడల్ సాగరిక సోనా సుమన్, రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొంతకాలంగా తాను ఇండస్ట్రీలో ఉంటున్నా పెద్దగా అవకాశాలు రాలేదని, గతేడాది ఉమేశ్ కామత్ అనే వ్యక్తి కాల్ చేసి, రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. రాజ్ కుంద్రా ఎవరు అని అడిగితే శిల్పా శెట్టి భర్త అని కూడా చెప్పాడు. అంటూ ఆ వీడియోలో చెప్పింది.

Sagarika Shona Suman

 

‘లాక్‌డౌన్ కాబట్టి వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో నేను కాల్ చేశాను. ఇక కాల్ చేశాక న్యూడ్‌గా ఆడిషన్ ఇవ్వమనడంతో షాకయ్యాను. అలా కుదరదని గట్టిగా చెప్పాను. ఆ వీడియో కాల్‌లో ముగ్గురు జాయిన్ అయ్యారు. వాళ్లల్లో ఒక వ్యక్తి తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అతనే రాజ్ కుంద్రా అనుకుంటున్నాను. అతడే కనుక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లయితే అరెస్ట్ చేసి, నాలా ఇంకెంతమందితో ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డాడో విచారించి ఈ రాకెట్ బయటపెట్టాలని పోలీసులను కోరుతున్నాను’ అంటూ రాజ్ కుంద్రా గురించి కామెంట్స్ చేసింది సాగరిక సుమన్.