Shiva Rajkumar: రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు గ్యారంటీ.. శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్
రామ్ చరణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్(Shiva Rajkumar).
- V Santhosh Kumar
- Updated on- May 25, 2026 / 04:54 PM IST
Shiva Rajkumar interesting Comments About Ram Charan at peddi event
- రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ సూపర్
- శివన్న పాత్ర గౌర్నయుడు చాలా పవర్‌ఫుల్
- చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయమన్న శివరాజ్
Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా (పెద్ది) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇండియాలో ముందెన్నడూ చూడని ‘క్రాస్ ఓవర్ అథ్లెట్’ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి, చరణ్ రస్టిక్ మేకోవర్‌కు సినీ ప్రియులు, ఆడియన్స్ పూర్తిగా ఫిదా అయిపోయారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
Rambha: రంభ తండ్రి కన్నుమూత.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్
తాజాగా ఈ చిత్ర బృందం కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఎత్తున ‘పెద్ది’ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాలో ఆయన ‘గౌర్నయుడు’ అనే అత్యంత పవర్‌ఫుల్, కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా శివన్న మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, రామ్ చరణ్ వ్యక్తిత్వంపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయి ఉండి కూడా సెట్స్‌లో చూపించే క్రమశిక్షణ, నమ్రత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు.
ముఖ్యంగా సినిమా గురించి శివన్న మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ నటన అద్భుతమని, క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, నటనకు ఖచ్చితంగా నేషనల్ అవార్డు (జాతీయ అవార్డు) గ్యారంటీ అంటూ ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. శివన్న ఇచ్చిన ఈ పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్‌తో మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.
