Shiva Srishti Vyakaranam : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదవ కంటెస్టెంట్.. మోడల్ సృష్టి..
పదవ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసే పని యాంకర్ శ్రీముఖికి ఇచ్చారు. (Shiva Srishti Vyakaranam)
- Saketh U
- Published on- September 6, 2026 / 09:33 PM IST
Shiva Srishti Vyakaranam
Shiva Srishti Vyakaranam : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష లో షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసే పని యాంకర్ శ్రీముఖికి ఇచ్చారు. అగ్నిపరీక్షలో ఫైనల్ లిస్ట్ లో నిలిచిన వాళ్లలో శ్రీముఖి సృష్టిని సెలెక్ట్ చేసింది.
Also Read : Temper Vamsi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన తొమ్మిదవ కంటెస్టెంట్.. హౌస్ లోకి వచ్చిన విలన్..
సృష్టి పూర్తి పేరు శివ సృష్టి వ్యాకరణం. సృష్టి ఒక మోడల్. మోడల్ గా వర్క్ చేసింది. విదేశాల్లో ఉంటూ ఇప్పుడు బిగ్ బాస్ కి అప్లై చేసి అగ్నిపరీక్షకు వచ్చింది. అగ్నిపరీక్షలో డేరింగ్ టాస్క్ లు చేసి అందర్నీ మెప్పించింది. సృష్టి ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
