Shivakumar : నాన్న తాగొచ్చి.. ఫ్యామిలీ అంతా కిరోసిన్ పోసుకొని సూసైడ్.. మా అమ్మ – నాన్నకు డివోర్స్ ఇప్పిస్తున్నా..
ఈ క్రమంలో తన తండ్రి వల్ల తాను, తన తల్లి, చెల్లి ఎన్ని బాధలు పడ్డారో తెలిపాడు. (Shivakumar)
- Saketh U
- Updated on- May 31, 2026 / 11:16 AM IST
Image Credits : Big TV Plus YouTube Channel
Shivakumar : సెలబ్రిటీల లైఫ్ లో కూడా గతంలో ఎన్నో కష్టాలు చూసి సక్సెస్ అయినవాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో సీరియల్ నటుడు శివకుమార్ ఒకరు. పలు కన్నడ, తెలుగు టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న శివకుమార్ సీరియల్ నటి ప్రియాంక జైన్ లవర్ గా మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు.
శివకుమార్ – ప్రియాంక జైన్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో రీల్స్, ఫోటోషూట్స్ తో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా శివ కుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్నతనంలో పడ్డ కష్టాలు గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన తండ్రి వల్ల తాను, తన తల్లి, చెల్లి ఎన్ని బాధలు పడ్డారో తెలిపాడు.
Also Read : Peddi : దటీజ్ చెర్రీ.. తెలుగు స్టేట్స్ను ఊపేస్తున్న పెద్ది ఫీవర్
శివ కుమార్ మాట్లాడుతూ.. మా నాన్న బస్సు కండక్టర్. అమ్మ టీచర్ జాబ్ చేసేది. మా అమ్మే నాన్న కంటే ఎక్కువ సంపాదించేది. స్కూల్ నుంచి కొంచెం లేట్ గా వచ్చినా ఎవరితో తిరుగుతున్నావు అని అమ్మతో గొడవ పడేవాడు నాన్న. ఒక రోజు 20 రూపాయలు తన జేబులోంచి పోయాయని మా అమ్మే తీసేసింది అనుమానించి పెద్ద గొడవ పడ్డాడు. ఊరంతా వచ్చింది ఆ గొడవ చూసి. మా అమ్మను తాగొచ్చి కొట్టేవాడు. ఆయన చేసే పనులకు మా వల్ల కాక నేను, అమ్మ చెల్లి చనిపోదాం అనుకున్నాం. మీద కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె వెలిగిద్దామనుకున్న సమయంలో మా అమ్మ స్టూడెంట్ వచ్చి ఆపి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళిపోయింది. లేకపోతే ఆ రోజే మేము చనిపోయేవాళ్ళం.
మా నాన్న ఇప్పటికి మారలేదు. అతనికి పిల్లలు, వైఫ్ ప్రేమ తెలీదు. వేరే వాళ్ళ ఫాదర్స్ ని చూస్తుంటే ఎమోషనల్ అయిపోతా. నాలుగేళ్ళ క్రితం నేను హైదరాబాద్ లో సీరియల్స్ చేసేటప్పుడు ఓ రోజు మా నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ చేసాడు. మా అమ్మ, చెల్లి నాకు ఫోన్ చేసి అతని వల్ల అవ్వట్లేదు అని ఏడ్చేశారు. అప్పట్నుంచి నేను ఆయన్ని దూరం పెట్టేసా. వేరే ఇంటికి వచ్చేసాం. ఆయన వల్ల నా ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అని మా నాన్నని మాకు దూరంగా ఉంచేసా. మా అమ్మకు డైవర్స్ ఇమ్మని చాలా సార్లు చెప్పినా మా గురించి, సొసైటీ గురించి ఆలోచించి వద్దు అనేది. ఇప్పుడు మా అమ్మకు – నాన్నకు డివోర్స్ ఇప్పిస్తున్నా. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. మా నాన్న నుంచి దూరంగా ఉన్న తర్వాత ఆయనకు యాక్సిడెంట్ అయి క్లూ విరిగి ఆయన నడవలేకపోతే సేవలు చేసింది మా అమ్మ, చెల్లి. మా నాన్నకు లేని అలవాటు లేదు. అయినా అన్ని అనుభవించింది మా అమ్మ. మా తాతయ్యని కూడా కొట్టారు మా నాన్న. నాన్న ప్రేమ నాకు ఇప్పటిదాకా దొరకలేదు. కానీ ఆయన చివరి దశలో నేనే చూసుకోవాలి ఏమో. చూసుకుంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు వచ్చేస్తున్నాడు.. ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ అనౌన్స్..
