Srinivasa Mangapuram : ఘట్టమనేని వారసుడు వచ్చేస్తున్నాడు.. ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ అనౌన్స్..
కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా హీరో హీరోయిన్స్ ని పరిచయం చేస్తూ నిన్న మే 30న ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు. (Srinivasa Mangapuram)
Srinivasa Mangapuram
Srinivasa Mangapuram : ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా, బాలీవుడ్ భామ రాషా తడాని జంటగా శ్రీనివాస మంగాపురం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జెమినీ కిరణ్ నిర్మాణంలో అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేసారు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ లవ్ అండ్ యాక్షన్ గా ఉండబోతుంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా హీరో హీరోయిన్స్ ని పరిచయం చేస్తూ నిన్న మే 30న ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ తో రాఘవేంద్రరావు, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు.. పలువురు సినీ ప్రముఖులు, ఘట్టమనేని అభిమానులు హాజరయ్యారు.
Also Read : Peddi : సీఎం విజయ్ ని పొగిడిన రామ్ చరణ్.. తమిళనాడులో ‘పెద్ది’కి ఫుల్ సపోర్ట్..
ఈ ఈవెంట్లో నిర్మాత అశ్వినీదత్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ.. కృష్ణ గారితో సినిమాలు చేశాను. మహేష్ బాబుని సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో హీరోని పరిచయం చేయడం ఆనందంగా ఉంది. శ్రీనివాస మంగాపురం సినిమా జూలై 9న థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది అని తెలిపారు. దీంతో మహేష్ ఫ్యాన్స్, ఘట్టమనేని అభిమానులు తమ కొత్త హీరో మొదటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటివరకు అయితే ఆ డేట్ కి వేరే ఏ సినిమా ప్రకటించలేదు. ఆ సమయం వరకు ఏ సినిమా అనౌన్స్ చేయకపోతే శ్రీనివాస మంగాపురం సినిమాకు కలెక్షన్స్ పరంగా ప్లస్ అవ్వడం ఖాయం.
Also Read : Vijay Trisha : సీఎం అయ్యాక తొలిసారి విజయ్.. త్రిషతో కలిసి ఒకే కార్ లో వచ్చి.. వీడియోలు వైరల్..
