Peddi : సీఎం విజయ్ ని పొగిడిన రామ్ చరణ్.. తమిళనాడులో ‘పెద్ది’కి ఫుల్ సపోర్ట్..
రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడిన అనంతరం ఇటీవల తమిళనాడుకు సీఎం అయిన హీరో విజయ్ గురించి మాట్లాడారు. (Peddi)
Peddi
Peddi : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. పెద్ది సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో దేశంలోని పలు నగరాల్లో పెద్ది ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా మే 30న తమిళనాడు చెన్నైలో పెద్ది ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడిన అనంతరం ఇటీవల తమిళనాడుకు సీఎం అయిన హీరో విజయ్ గురించి మాట్లాడారు. అలాగే చరణ్ చిన్నప్పుడు చెన్నైలోనే పెరగడంతో తమిళ్ వచ్చు కాబట్టి స్పీచ్ ఆల్మోస్ట్ తమిళ్ లోనే మాట్లాడారు.
Also Read : Vijay Trisha : సీఎం అయ్యాక తొలిసారి విజయ్.. త్రిషతో కలిసి ఒకే కార్ లో వచ్చి.. వీడియోలు వైరల్..
చరణ్ విజయ్ గురించి మాట్లాడుతూ.. ఇటీవల తమిళనాడు సీఎం అయిన మన జోసఫ్ విజయ్ సర్ కి శుభాకాంక్షలు. ఆయన పీక్ కెరీర్ లో ఉన్నప్పుడు, స్టార్ డమ్ ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. ఇందుకు ఒక సినిమా వ్యక్తిగా నేను గర్వపడుతున్నాను. తమిళనాడు ప్రజలకు, విజయ్ సర్ కి శుభాకాంక్షలు అని అన్నారు. దీంతో తమిళనాట విజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
విజయ్ ఫాన్స్, టీవీకే పార్టీ కార్యకర్తలు చరణ్ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమాకు విజయ్ ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ వచ్చినట్టే. అలాగే ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం అక్కడ సినిమాలకు అడక్కుండానే అయిదు షోలకు పర్మిషన్ ఇచ్చేసింది. దీంతో పెద్ది సినిమాకు కూడా అయిదు షోలకు పర్మిషన్స్ వచ్చేసినట్టే అని తెలుస్తుంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి కూడా పెద్ది సినిమాకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని తమిళ మీడియా సమాచారం.
Also Read : Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ బర్త్ డే స్పెషల్.. శోభిత బోల్డ్ ఫొటోలు..
