Shivaraj Kumar: ‘పెద్ది’ సినిమాలో శివన్న.. గౌరి నాయుడుగా పవర్ ఫుల్ రోల్.. వీడియో రిలీజ్ చేసిన మేకర్స్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి శివరాజ్ కుమార్(Shivaraj Kumar) లుక్ ను రివీల్ చేసిన మేకర్స్.
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 08:35 PM IST
Shivarajkumar playing gaurnaidu role in peddi movie
- ‘పెద్ది’ సినిమా క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
- శివన్న గౌరి నాయుడు పాత్ర చేస్తున్నారు.
- జూన్ 4న సినిమా విడుదల కానుంది.
Shivaraj Kumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’ (RC16) నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్(Shivaraj Kumar) (శివన్న) ఒక అత్యంత పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆయన ఈ చిత్రంలో ‘గౌరి నాయుడు’ అనే బలమైన పాత్రను పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక గ్లింప్స్ వీడియోను కూడా చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో శివన్న కుస్తీ పట్లు పడుతూ ఊరమాస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
Urvashi Rautela: అమ్మబాబోయ్.. ఒక్క డ్రెస్ ఖరీదు రూ.1500 కోట్లా? కాన్స్‌లో దేవకన్యలా మెరిసిన ఊర్వశి
ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ పాత్ర రామ్ చరణ్‌కు కుస్తీలో శిక్షణ ఇచ్చే గురువుగా ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై తాజా అప్‌డేట్‌తో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Gournaidu a.k.a @nimmashivanna garu❤️🔥❤️🔥
Step into the raw world of #PEDDI#PEDDITrailer in 4 days 🔥
Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla… pic.twitter.com/HAV93MYYab
— Vriddhi Cinemas (@vriddhicinemas) May 14, 2026
